శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు
ABN , Publish Date - Sep 04 , 2026 | 06:23 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోగా క్యూలైన్ ఆక్టోపస్ భవనం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
మంగళవారం హుండీ ఆదాయం: రూ.4,45 కోట్లు
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 79,215
తలనీలాలు సమర్పించినవారు: 36,740
ఈ వార్తలు కూడా చదవండి:
75 ఏళ్ల వయసులోనూ మోదీ, చంద్రబాబు కష్టపడుతున్నారు
సహ విద్యార్థితో చనువుగా ఉందని..!
Read Latest AP News And Telangana News And International News And Telugu News