సెక్రటేరియట్ ముట్టడి ఉద్రిక్తం!
ABN , Publish Date - Sep 04 , 2026 | 06:00 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు గురువారం నిర్వహించిన సచివాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ డీకే అరుణ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు సచివాలయం సౌత్ ఈస్ట్ గేటు వద్ద మెరుపు ధర్నాకు దిగారు.
ప్రధాన ద్వారం వద్ద బీజేపీ నేతల ఆందోళన
రాంచందర్‌రావు, డీకే అరుణ సహా పలువురు నేతల అరెస్టు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసేదాకా ఆందోళన: రాంచందర్‌రావు
ప్రధాన ద్వారం వద్ద పార్టీ నేతల ఆందోళన
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, డీకే అరుణ సహా పలువురు నేతల అరెస్టు
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు గురువారం నిర్వహించిన సచివాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ డీకే అరుణ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు సచివాలయం సౌత్ ఈస్ట్ గేటు వద్ద మెరుపు ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోగా, కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా విద్యార్థుల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాలను ప్రభుత్వానికి సమర్పించేందుకు రాంచందర్‌రావు నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సచివాలయానికి ఆకస్మిక పాదయాత్ర చేపట్టారు. విద్యార్థుల ఆవేదనను నేరుగా ప్రభుత్వానికి వినిపించాలనే సంకల్పంతో ఆయన, పార్టీ కార్యకర్తలతో కలిసి సచివాలయానికి తరలివెళ్లారు. సచివాలయం ప్రధాన ద్వారం వద్దకు చేరుకోగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రాంచందర్‌రావుతో పాటు పార్టీ నాయకులు అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. రాంచందర్‌రావుతో పాటు బీజేపీ శ్రేణులను పోలీసుల అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన అక్రమ అరెస్టుపై రాంచందర్‌రావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 15వేల కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకపోవడం వల్ల దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువులకు, ఉద్యోగ అవకాశాలకు దూరమయ్యారని, వారి జీవితాలు సర్వనాశనమయ్యాయని మండిపడ్డారు. బకాయిలపై 8 లక్షల మంది విద్యార్థుల సంతకాలతో కూడిన వినతిపత్రాలను సేకరించినా సర్కారుకు కాస్తయినా చలంచలేదని, ఇది కాంగ్రెస్ పార్టీ అహంకారానికి, విద్యార్థి వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. బకాయిల కోసం వెనకడుగు వేసేది లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ సెక్రటేరియట్ ముట్టడిలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణను పోలీసులు అదుపులోకి తీసుకుని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రేవంత్‌కు అండగా.. ఆయన మాటకే అధిష్ఠానం ఓటు
రికార్డుల్లో ఒకలా.. 22ఏలో మరోలా!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News