Share News

బకెట్‌లో 160 డిటోనేటర్లు

ABN , Publish Date - Sep 04 , 2026 | 06:09 AM

ఆర్మీ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బొల్లారంలోని ఆర్మీ క్యాంప్‌సలో షూటింగ్‌ రేంజ్‌ను ఆనుకుని ఉన్న గోడ పక్కన ఖాళీగా ఉన్న గోల్ఫ్‌ ఎన్‌క్లేవ్‌ వెంచర్‌లో గురువారం 160 డిటోనేటర్లు బయటపడటం తీవ్ర కలకలం రేపింది.

బకెట్‌లో 160 డిటోనేటర్లు
Detonators

  • బొల్లారంలోని ఆర్మీ క్యాంప్‌ వద్ద ఓ ప్రైవేటు వెంచర్‌లో లభ్యం

  • కేసు నమోదు చేసిన పోలీసులు

  • ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

హైదరాబాద్‌ సిటీ/అడ్డగుట్ట/తిరుమలగిరి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆర్మీ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బొల్లారంలోని ఆర్మీ క్యాంప్‌సలో షూటింగ్‌ రేంజ్‌ను ఆనుకుని ఉన్న గోడ పక్కన ఖాళీగా ఉన్న గోల్ఫ్‌ ఎన్‌క్లేవ్‌ వెంచర్‌లో గురువారం 160 డిటోనేటర్లు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, బాంబ్‌ డిస్పోజల్‌ టీమ్‌ ఘటన స్ధలానికి చేరుకొని.. ఒక బకెట్‌లో 8 బండల్స్‌లో 160 ఎలెక్ట్రికల్‌ డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల దొంగతనం వ్యవహారంతో ఇప్పటికే నెలకొన్న ఉత్కంఠ ఈ తాజా పరిణామంతో మరింత పెరిగింది. అయితే, కొద్దిసేపట్లోనే దీనికి తెరపడింది. ఆ స్థలం ఒక ప్రైవేటు వెంచర్‌ అని, దాంట్లో జరిగే డెవల్‌పమెంట్‌ పనుల్లో భాగంగా డిటోనేటర్లు తెచ్చి పెట్టారని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆ వెంచర్‌ నిర్వాహకులతో మాట్లాడి వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామన్నారు. డిటోనేటర్లను నిర్లక్ష్యంగా ఆర్మీ గోడ సమీపంలో వదిలేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. డిటోనేటర్లకు ఆర్మీ అయుధాల చోరీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు, బొల్లారంలోని 20-మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ బెటాలియన్‌లో జరిగిన చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. 150 మంది పోలీసులతో కూడిన బృందాలు, రక్షణశాఖకు చెందిన పలు విభాగాలు దీంట్లో పాల్గొంటున్నాయి. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నలుగురు అనుమానితుల పాత్రపై దర్యాప్తు అధికారులు ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. బెటాలియన్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ ప్రాంతాలు మొదలుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లోని వందలాది సీసీటీవీ కెమెరాల పుటేజీలను

పోలీసులు పరిశీలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సెక్రటేరియట్‌ ముట్టడి ఉద్రిక్తం!

రికార్డుల్లో ఒకలా.. 22ఏలో మరోలా!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 06:10 AM