Share News

నేను మాట్లాడితే మా అమ్మను ఎందుకు బలి చేశారు ?

ABN , Publish Date - Sep 04 , 2026 | 05:24 AM

కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనప్పుడు కొడుకు చేసిన తప్పుకు తండ్రిని ఎలా అరెస్టు చేస్తామన్న సీఎం రేవంత్‌ రెడ్డి.. తాను చేసిన వ్యాఖ్యలను తన తల్లిని ఎందుకు బలిచేశారని మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ప్రశ్నించారు.

నేను మాట్లాడితే మా అమ్మను ఎందుకు బలి చేశారు ?
Konda Sushmitha

  • పార్టీకి కాదు.. ఓ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడా

  • రేవంత్‌ రెడ్డి వన్‌ టైం జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ

  • కొండా సురేఖ బర్తర్‌ఫపై ఆమె కుమార్తె కొండా సుస్మిత

హైదరాబాద్‌, సెప్టెంబరు 3, (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనప్పుడు కొడుకు చేసిన తప్పుకు తండ్రిని ఎలా అరెస్టు చేస్తామన్న సీఎం రేవంత్‌ రెడ్డి.. తాను చేసిన వ్యాఖ్యలను తన తల్లిని ఎందుకు బలిచేశారని మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ప్రశ్నించారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడంపై సుస్మిత స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వన్‌ టైం జడ్పీటీసీ, వన్‌టైం ఎమ్మెల్సీ, వన్‌టైం ఎమ్మెల్యే, వన్‌టైం ఎంపీ అని వ్యాఖ్యానించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన తల్లిని రేవంత్‌ రెడ్డి అవమానించారని సుస్మిత ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను టార్గెట్‌ చేశారని ఆరోపించారు. తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఓ వ్యక్తికి వ్యతిరేకంగానే మాట్లాడానని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కొండా కుటుంబం దారెటు?

అధిష్ఠానానికి రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 05:25 AM