Share News

సహ విద్యార్థితో చనువుగా ఉందని..!

ABN , Publish Date - Sep 04 , 2026 | 05:28 AM

విజయనగరంలో పద్నాలుగేళ్ల బాలిక తన సహ విద్యార్థితో చనువుగా ఉండటం చూసిన ముగ్గురు యువకులు బ్లాక్‌ మెయిల్‌ చేశారు. ఆ బాలికను లోబరుచుకుని లైంగికదాడి చేశారు. విజయనగరంలో ఈ దారుణం జరిగింది.

సహ విద్యార్థితో చనువుగా ఉందని..!

  • బ్లాక్‌మెయిల్‌ చేసి బాలికపై లైంగిక దాడి.. ముగ్గురిపై పోక్సో కేసు

విజయనగరం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): విజయనగరంలో పద్నాలుగేళ్ల బాలిక తన సహ విద్యార్థితో చనువుగా ఉండటం చూసిన ముగ్గురు యువకులు బ్లాక్‌ మెయిల్‌ చేశారు. ఆ బాలికను లోబరుచుకుని లైంగికదాడి చేశారు. విజయనగరంలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం మేరకు విజయనగరంలో ఉంటున్న బాలిక తన సహ విద్యార్థితో చనువుగా ఉండడాన్ని అదే ప్రాంతానికి చెందిన శ్రీకాంత్‌, చంద్రశేఖర్‌, అక్షయ్‌కుమార్‌ గమనించారు. తమ కోర్కె తీర్చకపోతే అన్నీ బయట పెడతామని బెదిరించి బాలికను లోబర్చుకున్నారు. ఇలా ఏడాదిగా పలుమార్లు లైంగిక దాడి చేశారు. పైగా అప్పుడప్పుడూ డబ్బులు తీసుకురమ్మని ఇబ్బంది పెట్టేవారు. ఈ నేపథ్యంలో ఈ నెల 1న ఆ బాలిక జిల్లా ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు ముగ్గురు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Sep 04 , 2026 | 05:28 AM