బెదిరింపుల్లో జెత్వానీ కుటుంబసభ్యుల పాత్ర!
ABN , Publish Date - Sep 03 , 2026 | 06:01 AM
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో ముంబై టీవీ సీరియల్ నటి కాదంబరి జెత్వానీతోపాటు ఆమె కుటుంబ సభ్యుల పాత్ర ఉందని విద్యాసాగర్ తరఫున న్యాయవాది విష్ణువర్థన్ వాదించారు.
వారి పేర్లు తొలగించడం సరికాదు: విద్యాసాగర్ తరఫు న్యాయవాది
విజయవాడ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో ముంబై టీవీ సీరియల్ నటి కాదంబరి జెత్వానీతోపాటు ఆమె కుటుంబ సభ్యుల పాత్ర ఉందని విద్యాసాగర్ తరఫున న్యాయవాది విష్ణువర్థన్ వాదించారు. విద్యాసాగర్ ఫిర్యాదుతో జెత్వానీపై నమోదైన కేసులో ఆమె కుటుంబసభ్యుల పేర్లు తొలగిస్తున్నట్టు సీఐడీ అధికారులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై బుధవారం వాదనలు జరిగాయి. విద్యాసాగర్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో జెత్వానీ తల్లిదండ్రులు ఆశ, నరేంద్ర కుమార్, సోదరుడు అంబరీష్‌ల పాత్ర ఉందని విష్ణువర్థన్ వాదించారు. ఈ కేసులో ఐపీసీ 390, 411 సెక్షన్లను చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. జరిగిన నేరంలో భాగస్వామ్యం ఉన్నందున వారి పేర్లను కేసు నుంచి తొలగించడం సరికాదన్నారు. తదుపరి వాదనలను ఈనెల 16వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయాధికారి తిరుమలరావు ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..