Share News

నేత్రదానంతో మరికొందరికి చూపు

ABN , Publish Date - Sep 02 , 2026 | 11:49 PM

నేత్రదానం చేయడం ద్వారా మరికొంద రికి చూపును ప్రసాదించవచ్చని, ఈ దిశగా ప్రతిఒక్కరూ ముందుకురావాలని డీఎంహెచ్‌వో డా.ఈవీ నరేష్‌కుమార్‌ అన్నారు.

నేత్రదానంతో మరికొందరికి చూపు
నేత్రదానంపై ప్రతిజ్ఞ చేయిస్తున్న డీఎంహెచ్‌వో నరేష్‌కుమార్‌

డీఎంహెచ్‌వో డా.నరేష్‌కుమార్‌

శ్రీకాకుళం కల్చరల్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): నేత్రదానం చేయడం ద్వారా మరికొంద రికి చూపును ప్రసాదించవచ్చని, ఈ దిశగా ప్రతిఒక్కరూ ముందుకురావాలని డీఎంహెచ్‌వో డా.ఈవీ నరేష్‌కుమార్‌ అన్నారు. నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా బుధవారం రెడ్‌క్రాస్‌ భవనం వద్ద ప్రతిజ్ఞ చేయిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేత్రదానం ప్రాణదానంతో సమానమన్నారు. రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ.. ఇప్ప టి వరకు జిల్లాలో డోనర్ల ద్వారా 1,197 కార్ని యాలను సేకరించి చూపులేని వారికి అందించా మన్నారు. అనంతరం నేత్రదానానికి ఎక్కువ మందిని చైతన్యం చేసిన వలంటీర్లు వలసయ్య, చైతన్యకుమార్‌, తవుడులకు ప్రశం సాపత్రాలను అందజేసి అభినందించారు. కార్య క్రమంలో రెడ్‌క్రాస్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు బి.చిన్మ యరావు, కె.సత్యనారాయణ, రమణ, పి.రాజేష్‌, ఉమ, పి.సుజాత, హర్షవర్థన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 11:49 PM