ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
ABN , Publish Date - Sep 02 , 2026 | 06:51 AM
ఉక్రెయిన్‌పై రష్యా చేసిన భారీ దాడిలో జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌గౌడ్(42) మృతి చెందాడు...
మొత్తం 12 మంది దుర్మరణం
లండన్, జగిత్యాల అర్బన్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఉక్రెయిన్‌పై రష్యా చేసిన భారీ దాడిలో జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌గౌడ్(42) మృతి చెందాడు. మంగళవారం ఉదయం తాను నివాసం ఉంటున్న గది నుంచి బయటకు వచ్చిన సమయంలోనే ఈ దాడి జరగడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడి చాడు. స్వగ్రామంలో సెట్రింగ్ పని చేసిన సుదర్శన్‌గౌడ్ నాలుగు నెలల క్రితమే ఉపాధి నిమిత్తం ఉక్రెయిన్ వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున కీవ్ సహా పలు ప్రాంతాలపై క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.. కాగా సుదర్శన్‌గౌడ్‌తో పాటు ఉక్రెయిన్‌లో ఉంటున్న తాటిపెల్లి గ్రామానికి చెందిన వేణు ద్వారా ఈ ఘటన గురించి మృతుడి కుటుంబసభ్యులకు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి
పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని
వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..