Share News

వైసీపీకి రాజీనామా దిశగా పీవీఎల్ నరసింహారాజు?

ABN , Publish Date - Jul 24 , 2026 | 08:47 AM

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పీవీఎల్ నరసింహారాజు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఈరోజే తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

వైసీపీకి రాజీనామా దిశగా పీవీఎల్ నరసింహారాజు?
PVL Narasimha Raju

పశ్చిమ గోదావరి జిల్లా, జులై 24 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పీవీఎల్ నరసింహారాజు (PVL Narasimha Raju) రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఈరోజే తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.


వైసీపీ అధిష్ఠానం ఉండి నియోజకవర్గ సమన్వయకర్తగా మంతెన యోగేంద్ర కుమార్‌ను నియమించింది. అదే సమయంలో పీవీఎల్ నరసింహారాజును పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించింది. అయితే నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తనను తప్పించడంపై నరసింహారాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ నిర్ణయంపై ఆయన వర్గీయులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకుడిని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పీవీఎల్ నరసింహారాజు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై అసంతృప్తితో రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

దేవతా విగ్రహాలపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: మంత్రి ఆనం

అమరావతికి ప్రముఖ విద్యాసంస్థలు వస్తున్నాయి: మంత్రి గొట్టిపాటి

భూమన ఆక్రమించిన భూముల స్వాధీనానికి ఏపీ ప్రభుత్వం చర్యలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 08:59 AM