ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్‌లో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు మొద్దు నిద్రపోయారు: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Jun 14 , 2026 | 05:05 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లు అధికారం ఇస్తే అభివృద్ధిని గాలికొదిలేసి తాడేపల్లి ప్యాలెస్‌లో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు మొద్దు నిద్రపోయారని ఎద్దేవా చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు (AP Minister Nimmala Ramanaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లు అధికారం ఇస్తే అభివృద్ధిని గాలికొదిలేసి తాడేపల్లి ప్యాలెస్‌లో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు మొద్దు నిద్రపోయారని ఎద్దేవా చేశారు. ఈరోజు(ఆదివారం) పాలకొల్లు నియోజకవర్గంలో రూ 2.39 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వస్తే పరదాలు, బారికేడ్లు,144 సెక్షన్, 30 యాక్ట్, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్ట్ లు చేసేవారని ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వలో 20 నెలల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గొడ్డలి పార్టీ నాయకులకు కనిపించడం లేదా అని మంత్రి నిమ్మల ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని మోదీల కలయికతో అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. జగన్ హయాంలో పాలకొల్లులో టిడ్కో ఇళ్లు ఇచ్చే కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేగా వేదిక ఎక్కుతుంటే గెంటేసి తనపై గొడ్డలి పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారని ఆగ్రహించారు. 2029లో అధికారంలోకి వస్తే రప్పా రప్పా నరుకుతామని ప్రజలను గొడ్డలి పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ అడ్డుకుంటోంది.. కొల్లు రవీంద్ర ధ్వజం
ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News