Share News

ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:34 PM

ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి టీజీ భరత్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ పార్కుల ద్వారా వేలాదిమందికి ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు.

ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్
AP Minister TG Bharat

కర్నూలు, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి టీజీ భరత్ గుప్తా (AP Minister TG Bharat) వ్యాఖ్యానించారు. ఈ పార్కుల ద్వారా వేలాదిమందికి ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు. ఈరోజు(శనివారం) మంత్రి భరత్ కర్నూల్‌లో పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 19 కంపెనీల్లో 1460 ఉద్యోగాలకు జాబ్‌మేళా నిర్వహించామని తెలిపారు. ఒక్కరికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.


ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్‌మేళా..

ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్‌మేళా నిర్వహిస్తామని మంత్రి భరత్ వివరించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు సృష్టించేందుకు కష్టపడుతున్నామని చెప్పుకొచ్చారు. ఓర్వకల్లుకు గతంలో ఎప్పుడు లేనంతగా కంపెనీలను తీసుకువస్తున్నామని తెలిపారు. రిలయన్స్, అగస్త్య కంపెనీలను కర్నూలుకు తీసుకువచ్చామని ప్రస్తావించారు. జైరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీ మరో రూ.6 వేల కోట్ల పెట్టుబడిని పెడుతోందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆలోచనలు అమలైతే ప్రపంచంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంటుందని ఉద్ఘాటించారు. ఇప్పటికే దేశంలోకి వచ్చే 25 శాతం పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని మంత్రి భరత్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏఐ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీతో విద్యార్థులకు భవిష్యత్తు నైపుణ్యాలు: సీఎం చంద్రబాబు

డీఎస్సీపై అపోహలు వద్దు.. అక్టోబర్‌లో మరో నోటిఫికేషన్: ఏపీ విద్యాశాఖ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 12:52 PM