Share News

విద్యార్థుల జ్వరాలపై ఆందోళన చెందొద్దు.. మెరుగైన వైద్యం అందిస్తాం: మంత్రి సత్యకుమార్‌

ABN , Publish Date - Nov 06 , 2026 | 02:20 PM

పార్వతీపురం మన్యం జిల్లా శివన్నపేట గురుకులంలో విద్యార్థుల జ్వరాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్‌ ఆరా తీశారు. శుక్రవారం హెల్త్ డైరెక్టర్‌, జిల్లా అధికారులతో మాట్లాడిన మంత్రి.. గురుకులంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని వెల్లడించారు.

విద్యార్థుల జ్వరాలపై ఆందోళన చెందొద్దు.. మెరుగైన వైద్యం అందిస్తాం: మంత్రి సత్యకుమార్‌
AP Minister Satyakumar

పార్వతీపురం మన్యం జిల్లా, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా శివన్నపేట గురుకులంలో విద్యార్థుల జ్వరాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్‌ (AP Minister Satyakumar) ఆరా తీశారు. ఈరోజు (శుక్రవారం) హెల్త్ డైరెక్టర్‌, జిల్లా అధికారులతో మాట్లాడిన మంత్రి.. గురుకులంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని వెల్లడించారు. గురుకులంలో మొత్తం 71 మందికి జ్వరాలు రాగా.. ఇప్పటికే 30 మంది విద్యార్థులు పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. 516 మంది విద్యార్థులకు ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా.. కేవలం ఒకరికి మాత్రమే మలేరియా పాజిటివ్‌, మిగతా అందరికీ నెగెటివ్‌ వచ్చిందని చెప్పుకొచ్చారు.


ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశాం..

ప్రస్తుతం 38 మందిని ప్రత్యేకంగా వైద్యుల సంరక్షణలో ఉంచినట్లు మంత్రి వివరించారు. కురుపాం సీహెచ్‌సీలో మరో ముగ్గురు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం గురుకులంలో జనరల్‌ మెడిసిన్‌, పిల్లల వైద్య నిపుణులతో ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థులకు సోకినవి తుఫాన్ అనంతర వైరల్‌ జ్వరాలేనని వైద్య నిపుణులు ప్రాథమిక అంచనా వేశారని తెలిపారు.


అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి..

44 మంది విద్యార్థులకు రక్తపరీక్షలు చేయగా ఫలితాలు సాధారణంగా వచ్చాయని.. ల్యాబ్‌కు విద్యార్థుల రక్త నమూనాలు చేరాయని వెల్లడించారు. పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు మూడు తాగునీటి వనరుల నమూనాలను పంపినట్లు మంత్రికి అధికారులు వివరించారు. జ్వర లక్షణాలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని.. అయినా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు కేసులపై హైకోర్టులో కీలక విచారణ

ప్రాణాలకు తెగించి పోలీసుల రెస్క్యూ ఆపరేషన్.. హోం మంత్రి అనిత ప్రశంసలు

కడప, పులివెందులలో జగన్ అరాచకాలు, దౌర్జన్యాలతో ఓటర్లను భయపెడుతున్నారు.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 02:56 PM