Share News

అల వైభోగాపురములో గిన్నిస్‌పై థింసా గురి!

ABN , Publish Date - Jul 31 , 2026 | 07:02 AM

గిరిజన సంప్రదాయ నృత్యం థింసా.. బృంద గానంలాంటింది! పది నుంచి పాతికమంది జట్టుకట్టి లయబద్ధంగా నృత్యం చేయడం దీని ప్రత్యేకత! చూపరులను ఎంతోగానో ఆకట్టుకుంటుందీ నృత్యం! అలాంటిది పదులూ వందలూ కాదు.. ఏకంగా పద్నాలుగు వేల మంది ఒకేసారి థింసా నృత్యం చేస్తే..! అద్భుతం కదూ!! ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభించనున్న భోగాపురం విమానాశ్రయం ఆవరణలో ఈ అద్భుత ఆవిష్కరణ జరగనుంది.

అల వైభోగాపురములో గిన్నిస్‌పై థింసా గురి!
Tribal Thinsa Dance

  • ప్రధాని మోదీ స్వాగతానికి అద్భుత ఏర్పాట్లు

  • ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో 14 వేల మంది బాలికల రిహార్సల్స్‌

గిరిజన సంప్రదాయ నృత్యం థింసా.. బృంద గానంలాంటింది! పది నుంచి పాతికమంది జట్టుకట్టి లయబద్ధంగా నృత్యం చేయడం దీని ప్రత్యేకత! చూపరులను ఎంతోగానో ఆకట్టుకుంటుందీ నృత్యం! అలాంటిది పదులూ వందలూ కాదు.. ఏకంగా పద్నాలుగు వేల మంది ఒకేసారి థింసా నృత్యం చేస్తే..! అద్భుతం కదూ!! ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభించనున్న భోగాపురం విమానాశ్రయం ఆవరణలో ఈ అద్భుత ఆవిష్కరణ జరగనుంది. వేలాది గిరిజన బాలికల థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం పలకడానికి సన్నాహాలు చేశారు.


ఇందులోభాగంగా.. సుమారు 14వేల మంది గిరిజన బాలికలు గురువారం ఎయిర్‌పోర్టు ప్రాంగణలో ప్రాక్టీసు కమ్‌ రిహార్సల్స్‌ చేశారు. మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి విద్యార్థినులతో థింసా ఆడి సందడి చేశారు. గిన్నిస్‌ బుక్‌ రికార్డు లక్ష్యంగా ఉత్తరాంధ్రకు చెందిన 9,10 చదువుతున్న బాలికలు.. పాడేరు ఐటీడీఏ నుంచి 7 వేలు, పార్వతీపురం నుంచి 3 వేలు, సీతంపేట నుంచి 2 వేలు, రంపచోడవరం నుంచి 2 వేలు మొత్తం 14వేల మంది తరలివచ్చారు. వీరికి విజయనగరం, పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల, భోగాపురంలో వసతి ఏర్పాట్లు చేశారు.

-ఆంధ్రజ్యోతి, భోగాపురం


వార్తలు కూడా చదవండి...

హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు

కియాతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 07:02 AM