విశాఖ స్టీల్ ప్లాంట్‌లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
ABN , Publish Date - Sep 24 , 2026 | 10:26 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో నకిలీ ఐడీ కార్డులతో దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో పైడిపాటి వెంకట భార్గవ్, పొతిన్ శ్రీకాంత్, ఇసుకపల్లి నాగేంద్ర వర్మ, గర్తియ రవి శంకర్, బంగారు సతీశ్ కుమార్, ఇసుకపల్లి వంశీ, నవాబు యువరాజులుగా పోలీసులు గుర్తించారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో (Visakhapatnam Steel Plant) నకిలీ ఐడీ కార్డులతో దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో పైడిపాటి వెంకట భార్గవ్, పొతిన్ శ్రీకాంత్, ఇసుకపల్లి నాగేంద్ర వర్మ, గర్తియ రవిశంకర్, బంగారు సతీశ్ కుమార్, ఇసుకపల్లి వంశీ, నవాబు, యువరాజులుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల ఒరిజినల్ ఐడీ కార్డులను మార్ఫింగ్ చేసి ప్లాంట్‌లోకి దొంగలు ప్రవేశించారు. నకిలీ సీఐఎస్ఎఫ్ (CISF) స్టాంపులతో నకిలీ ఐడీ కార్డులను తయారు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నకిలీ కార్డుల సహాయంతోనే వారు ప్లాంట్‌లోకి ప్రవేశించి రాగి, ఉక్కును దొంగిలించినట్లుగా పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి సుమారు 300 కేజీల రాగి, ఐదు నకిలీ ఐడీ కార్డులు, రెండు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ వేళ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
భారీ వర్షాల వేళ విజయవాడ కొండ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి: మంత్రి నారాయణ
తుఫాన్ వేళ ప్రజా రవాణాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి జనార్దన్ రెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News