రాజకీయాల్లో వెంకయ్య నాయుడు స్ఫూర్తిదాయకం: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Jul 12 , 2026 | 08:02 PM
రాజకీయాల్లో వెంకయ్య నాయుడు స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరమని ఉద్ఘాటించారు.
విశాఖపట్నం, జులై 12 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో వెంకయ్య నాయుడు స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరమని ఉద్ఘాటించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు జీవిత విశేషాలపై వెలువడిన 'వెంకయ్య నాయకుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలో ఈరోజు (ఆదివారం) ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి అనిత ప్రసంగించారు. ఇది ఒక పుస్తకం కాదని.. ఓ చరిత్ర అని వ్యాఖ్యనించారు. రాబోయే తరాలకు కూడా ఆయన ఎంతో ఆదర్శమని కొనియాడారు. ‘మా శర్మగారు రాసిన పుస్తకం- రాబోయే తరాలు వారికి ఆదర్శం కానుంది’ అని ప్రశంసించారు.
రైతు కుటుంబంలో పుట్టి వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయ్యారని ప్రశంసించారు. విద్యార్థినేతగా ఎన్నో పోరాటాలు చేశారని కొనియాడారు. వెంకయ్య నాయుడు స్పీచ్‌లు యూట్యూబ్‌లో ఎన్నో వినేవాళ్లమని ప్రస్తావించారు. ‘మానాన్న విద్యార్థి దశలో ఉన్నప్పుడు, విద్యార్థి నాయకుడిగా మా నాన్నగారికి కూడా ఆయన సాయం చేశారు’ అని తెలిపారు. వెంకయ్య నాయుడు జీవితంలో ఎన్నో పదవుల్లో పనిచేశారని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణే లక్ష్యం: సీఎం చంద్రబాబు
యువత పరిశోధనలు, ఆవిష్కరణలు స్టార్టప్‌ల వైపు అడుగులు వేయాలి: గవర్నర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News