Share News

విశాఖలో బస్సు ప్రమాదం.. విద్యార్థులకు గాయాలు

ABN , Publish Date - Nov 28 , 2026 | 04:40 PM

విశాఖపట్నం కైలాసగిరిపై పాఠశాల బస్సు బోల్తా పడింది. కొండపై విద్యార్థుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో వెంటనే స్థానికులు,పాఠశాల సిబ్బంది అప్రమత్తమై చర్యలు చేపట్టారు.

విశాఖలో బస్సు ప్రమాదం.. విద్యార్థులకు గాయాలు
Visakhapatnam Kailasagiri Bus Accident

విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నగరంలోని కైలాసగిరిపై పాఠశాల బస్సు బోల్తా పడింది. కొండపై విద్యార్థుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో వెంటనే స్థానికులు, పాఠశాల సిబ్బంది అప్రమత్తమై చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విహార యాత్ర కోసం పిఠాపురం నుంచి విద్యార్థులు కైలాసగిరికి వచ్చారు. సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గురైన బస్సు కాకినాడ జిల్లా పిఠాపురం పాఠశాలకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.


బస్సు ప్రమాదంపై మంత్రి లోకేశ్ విచారం..

Nara-Lokesh.jpg

విశాఖపట్నం కైలాసగిరి వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పిఠాపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి విశాఖపట్నం కైలాసగిరికి విహార యాత్రకు వచ్చారని తెలిపారు. ఘాట్ రోడ్డులో బస్సు కిందకు దిగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. ఇద్దరు విద్యార్థులకు, ఒక ఉపాధ్యాయుడికి గాయాలయ్యాయని చెప్పుకొచ్చారు. గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని అన్నారు. అంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారని చెప్పారు. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. దూర ప్రాంతాలకు, విహార యాత్రలకు పిల్లలను తీసుకెళ్లేటప్పుడు వాహనాల ఫిట్‌నెస్‌ను తనిఖీ చేయడంతో పాటు, నైపుణ్యం గల డ్రైవర్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. పిల్లల భద్రతకు సంబంధించిన అన్ని చర్యలను సంబంధిత యాజమాన్యం తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


మెరుగైన వైద్యం అందించాలి: పల్లా శ్రీనివాసరావు

Palla Srinivasa Rao

ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పందించారు. విహారయాత్రకు వచ్చిన విద్యార్థులు ప్రమాదానికి గురికావడం బాధాకరమని అన్నారు. క్షతగాత్రులైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేసి విద్యార్థులందరినీ క్షేమంగా రక్షించాలని సూచించారు. గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని జగన్ అండ్ కో ఎగతాళి చేస్తున్నారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

రాజకీయ విభేదాలకు అతీతంగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలి: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 05:21 PM