Share News

క్రీడల్లో ప్రపంచస్థాయి సంస్థను విశాఖలో నిర్మించడమే లక్ష్యం: పీవీ సింధు

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:16 PM

క్రీడల్లో ప్రపంచస్థాయి సంస్థను విశాఖపట్నంలో నిర్మించడమే తన లక్ష్యమని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించారు. భారత్‌లో ప్రతిభకు కొదవ లేదని.. సరైన వేదికలే అవసరమని పేర్కొన్నారు.

క్రీడల్లో ప్రపంచస్థాయి సంస్థను విశాఖలో నిర్మించడమే లక్ష్యం: పీవీ సింధు
PV Sindhu

విశాఖపట్నo, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): క్రీడల్లో ప్రపంచస్థాయి సంస్థను విశాఖపట్నంలో నిర్మించడమే తన లక్ష్యమని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) వ్యాఖ్యానించారు. భారత్‌లో ప్రతిభకు కొదవ లేదని.. సరైన వేదికలే అవసరమని పేర్కొన్నారు. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో తలపెట్టిన పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేశ్ ఈరోజు (బుధవారం) భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పీవీ సింధు ప్రసంగించారు.


వేలాది క్రీడాకారుల కలలకు పునాది..

‘ఈ కలను ప్రారంభించేందుకు నాకు లోకేశ్ అన్ననే మొదట గుర్తొచ్చారు. మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తామని భరోసా ఇచ్చారు. లోకేశ్ ప్రోత్సాహమే ఈ ప్రాజెక్ట్‌కు బలమైంది’ అని పేర్కొన్నారు. ఇది కేవలం శంకుస్థాపన కాదని... వేలాది క్రీడాకారుల కలలకు పునాది అని పీవీ సింధు ఉద్ఘాటించారు. ప్రపంచ స్థాయి క్రీడా సంస్థల నుంచి స్ఫూర్తితో ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేశామని వివరించారు. ఒలింపిక్స్ పతకాలు ఒక తరం స్ఫూర్తి అని తెలిపారు. ఆయా సంస్థలు తరాలను తయారు చేస్తాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో ఈ ప్రాజెక్ట్ రూపురేఖలు మారాయని వివరించారు. ఒకే క్రీడ నుంచి 9 క్రీడా విభాగాలకు ప్రాజెక్ట్ విస్తరిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏపీ తొలి ఇండోర్ 25 మీటర్ల షూటింగ్ రేంజ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. తరతరాల క్రీడాకారులను తీర్చిదిద్దే కేంద్రంగా ఈ సంస్థ నిలుస్తుందని వెల్లడించారు.


ప్రపంచ స్థాయి క్రీడా ప్రమాణాలతో సింధు స్పోర్ట్స్ సెంటర్..

ప్రపంచ స్థాయి క్రీడా ప్రమాణాలతో సింధు స్పోర్ట్స్ సెంటర్ నిర్మిస్తున్నట్లు వివరించారు. కోచింగ్, రికవరీ, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యం ఇస్తామని పీవీ సింధు వ్యాఖ్యానించారు. ఇటలీ ఒలింపిక్స్ ప్రమాణాల స్విమ్మింగ్ పూల్ విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పారిస్ 2024 ఒలింపిక్ పూల్ నిర్మించిన సంస్థతోనే విశాఖ పూల్ నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బ్యాడ్మింటన్ హాల్‌లో అంతర్జాతీయ ప్రమాణాల ఎయిర్ సర్క్యులేషన్ వ్యవస్థ అని వివరించారు. అంతర్జాతీయ మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా అథ్లెట్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేశామని పీవీ సింధు పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు.. ఆ ల్యాండ్స్‌ను మానిటైజ్ చేస్తాం: సీఎం చంద్రబాబు

జల్ జీవన్ పనుల్లో వేగం పెంచాలి: పవన్ కల్యాణ్

లోకేశ్ ఎందుకు రాజీనామా చేయాలి.. వైసీపీపై మంత్రి అనగాని ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 05 , 2026 | 12:50 PM