మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా అమర్‌నాథ్ వ్యాఖ్యలు: పల్లా శ్రీనివాసరావు
ABN , Publish Date - Jun 15 , 2026 | 03:15 PM
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితపై అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని అవమానించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు.
విశాఖపట్నం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి వంగలపూడి అనితపై అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని అవమానించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈరోజు (సోమవారం) విశాఖపట్నం వేదికగా పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఒక మహిళా మంత్రిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగడం వైసీపీ సంస్కారహీన, దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.
వైసీపీ నేతల విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి..
మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా అమర్‌నాథ్ వ్యాఖ్యలు ఉన్నాయని పల్లా శ్రీనివాసరావు ఆగ్రహించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదని ధ్వజమెత్తారు. గొడ్డలి పార్టీ నేతల మాటల్లో మహిళల పట్ల గౌరవం, బాధ్యత పూర్తిగా లోపించాయని మండిపడ్డారు. గుడివాడ అమర్నాథ్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవం, ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. వైసీపీ నేతల విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని హితవు పలికారు.హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
భేషరతుగా అనితకు క్షమాపణ చెప్పాలి..
అలంకరణ అనేది ఆడవాళ్లకు ఆభరణమని అలాంటి అలంకరణపై అమర్‌నాథ్ వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పుకొచ్చారు. ఒక దళిత మహిళా కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగిన అనిత తీరుని మనం స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఇలా మానసిక క్షోభను గురి చేసే విమర్శలను చేయడం సరికాదని పేర్కొన్నారు. గుడివాడ అమర్నాథ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని.. భేషరతుగా అనితకు క్షమాపణ చెప్పాలని పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సింగపూర్‌లో సీఎం చంద్రబాబుకు గ్రాండ్ వెల్‌కమ్.. ఎన్ఆర్ఐల స్వాగతం
ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్‌లో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు మొద్దు నిద్రపోయారు: మంత్రి నిమ్మల
Read Latest Telangana News And AP News And National News
And Telugu News