టీడీపీలో చేరిన వైసీపీ కీలక నేతలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 06:47 PM
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాతా గురునాథరావు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు.
అనకాపల్లి జిల్లా, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాతా గురునాథరావు ఈరోజు (ఆదివారం) తెలుగుదేశం పార్టీలో చేరారు. నక్కపల్లిలోని క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత సమక్షంలో గురునాథరావుతోపాటు ఆయన అనుచరులు కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీకి చెందిన 30 కుటుంబాలు కూడా టీడీపీలో చేరాయి.
వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి హోం మంత్రి అనిత ఆహ్వానించారు. అలాగే ఉపమాక పంచాయతీ సారిపల్లిపాలెం గ్రామానికి చెందిన జోగా అప్పారావు, మామిడి చంద్రయ్యలు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వీరు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీలోకి క్రమంగా వలసలు కొనసాగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి
రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్ఈసీ
రాయచోటిలో కిరాయి ముఠాలతో ప్రజలను భయపెట్టాలని చూసే ఊరుకోం.. వైసీపీపై మండిపల్లి ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News