విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Sep 02 , 2026 | 06:57 PM
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాత ఎయిర్‌పోర్టులో వాణిజ్య విమానాల నిలిపివేతపై దాఖలైన పిల్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
ఢిల్లీ, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ కేసులో (Visakhapatnam Airport Case) ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. పాత ఎయిర్‌పోర్టులో వాణిజ్య విమానాల నిలిపివేతపై దాఖలైన పిల్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సమస్య ఉత్పన్నమైంది విశాఖపట్నంలోనే అని.. స్థానిక హైకోర్టులోనే సవాల్ చేయాలని న్యాయస్థానం సూచించింది. ఫోరమ్ కన్వీనియన్స్ ప్రాతిపదికన ఈ పిటిషన్ కొట్టివేసింది.
ప్రధాన కార్యాచరణ అంతా ఏపీలోనే ఉందని చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం స్పష్టం చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ వాదనలు వినిపించారు. కొత్త ఎయిర్‌పోర్ట్ విశాఖ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉందని, కనెక్టివిటీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకువచ్చారు. వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని న్యాయస్థానానికి పిటిషనర్ వివరించారు. అయితే బాధితులంతా విశాఖపట్నంలోనే ఉన్నందున సంబంధిత హైకోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్
సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్
ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News