ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడతాం: బొత్స సత్యనారాయణ
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:54 PM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఎవరైనా విమర్శ చేస్తే విధాన పరంగా ఉండాలన్నారు.
విశాఖపట్నం ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) పేర్కొన్నారు. ఎవరైనా విమర్శ చేస్తే విధాన పరంగా ఉండాలన్నారు. రేపు(బుధవారం) ఏపీలోని అన్ని జిల్లాల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. ఈరోజు(మంగళవారం) విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగాన్ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారని అన్నారు. రాజధాని పరిధిలో వీటిని తీసుకురమ్మని తాము అంటున్నామని.. ఇందులో తప్పు ఏం ఉందని చెప్పారు.
తమ నాయకుడు అభిప్రాయాన్ని తాము గౌరవిస్తున్నామన్నారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని...అక్కడ దోపిడీకి మాత్రమే తాము వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. కూటమి కృషితోనే భోగాపురం వచ్చిందని ఒప్పు కొంటున్నానని అన్నారు. తాము ఈ ఎయిర్‌పోర్టుకి అన్ని అనుమతులు తెచ్చామని..కానీ ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌కి దారి లేదని ప్రస్తావించారు. అందుకే తాము భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి దారేదని అడుగుతున్నామన్నారు. రుషికొండ భవనాలు తమ కోసం ఉంచుతున్నారేమోనని అన్నారు. ఏపీలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని చెప్పారు. మహిళలు రోజుకోకరు హత్యకు గురవుతున్నారని, వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And International News And Telugu News