సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టింగ్స్ చేస్తే కఠిన చర్యలు: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Jul 13 , 2026 | 03:43 PM
సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లుగా పోస్టింగులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో సైబర్, సోషల్ మీడియా కేసులు పెరిగాయని పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా, జులై 13 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లుగా పోస్టింగ్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anita) హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో సైబర్, సోషల్ మీడియా కేసులు పెరిగాయని పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులను హోం మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడారు.
ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ప్రతివారం నిర్వహిస్తున్న పీజేఆర్ఎస్ మంచి ఫలితాలను ఇస్తోందని హోం మంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. జిల్లాలో ఈ ఏడాది క్రైమ్ రేట్ 15 శాతం తగ్గిందని వెల్లడించారు. జిల్లాలో మహిళలపై చేసే దాడుల్లో క్రైమ్ రేటు 7 శాతం తగ్గిందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను నివారించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది: సీఎం చంద్రబాబు
సీఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఊరట
Read Latest AP News And Telangana News And National News
And Telugu News