Share News

ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 12 , 2026 | 09:57 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ దిశగా మోదీ చేస్తున్న కృషి ఫలితమిస్తోందని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, జులై 12 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ దిశగా మోదీ చేస్తున్న కృషి ఫలితమిస్తోందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ భారత దేశానికి గర్వకారణమని వ్యాఖ్యానించారు. మోదీకి అన్ని దేశాల్లో మంచి గౌరవం లభిస్తోందని తెలిపారు. మోదీ వల్లనే ప్రపంచంలో భారత దేశ కిర్తీ ప్రతిష్ఠలు మరింతగా పెరిగాయని ఉద్ఘాటించారు. రైట్ టైమ్, రైట్ ప్లేస్ రైట్ లీడర్ నరేంద్రమోదీ అని ప్రశంసించారు.


వియత్నాం ఘటనపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాం..

వియత్నాం బోటు ప్రమాద ఘటనపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ వాసులు పర్యాటకానికి వెళ్లి ప్రమాదం బారిన పడటం దురదృష్టకరమని అన్నారు. వియత్నాం ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను స్వస్థలాలకు రప్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. మిగిలిన టూరిస్టులను కూడా ఏపీకి తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో సమన్వనయం చేసుకుంటున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణే లక్ష్యం: సీఎం చంద్రబాబు

యువత పరిశోధనలు, ఆవిష్కరణలు స్టార్టప్‌ల వైపు అడుగులు వేయాలి: గవర్నర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 10:13 PM