Share News

అనకాపల్లి జిల్లా రోడ్డు ప్రమాదంలో యువతి మృతి.. హోం మంత్రి అనిత విచారం

ABN , Publish Date - Nov 27 , 2026 | 04:14 PM

అనకాపల్లి జిల్లా రేగుపాలెం వై జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ హోం మంత్రి అనిత విచారం వ్యక్తం చేశారు.

అనకాపల్లి జిల్లా రోడ్డు ప్రమాదంలో యువతి మృతి.. హోం మంత్రి అనిత విచారం
Anakapalli Road Accident

అనకాపల్లి జిల్లా , నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా రేగుపాలెం వై జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై సమాచారం అందగానే అక్కడకు చేరుకున్నారు. అధికారులను వివరాలు అడిగి అనిత తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ప్రమాదం జరిగిన జంక్షన్ వద్ద సిగ్నల్ లైట్లను వెంటనే ఏర్పాటు చేయాలని హోం మంత్రి అనిత ఆదేశించారు.


అసలు ఏం జరిగిందంటే..

తండ్రితో కలిసి కూతురు కల్యాణి ఈరోజు (శుక్రవారం) కాలేజీకి బైకుపై వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కూతురు కల్యాణికి తీవ్ర గాయాలు కాగా, తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆమెను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందింది. ఈ ఘటనకు ముందు.. తుని వైపు నుంచి వస్తున్న లారీ.. విశాఖపట్నానికి వచ్చేందుకు యూటర్న్ తీసుకుంటున్న లోడు లారీని ఢీకొట్టింది.


దీంతో లారీ నుంచి ఐరన్ బండిల్ రోడ్డు మీదకు దొర్లుకుంటూ కాలేజీకి తండ్రితో వెళ్తున్న కూతురి కాలిపై నుంచి వెళ్లడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుక.. భారీ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

స్థానిక ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు: డీజీపీ

Read Latest AP News And Telangana NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 04:41 PM