అయోధ్య - కాశీ దివ్య దర్శన యాత్ర తొలి విడతను ప్రారంభించాం: ఎంపీ రమేశ్
ABN , Publish Date - Jul 19 , 2026 | 10:52 AM
అయోధ్య - కాశీ దివ్య దర్శన యాత్ర తొలి విడతను ప్రారంభించామని అనకాపల్లి జిల్లా ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. అనకాపల్లి పార్లమెంట్ నుంచి సుమారు 1600 మందిని దివ్యదర్శన యాత్రకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా, జులై 19 (ఆంధ్రజ్యోతి): అయోధ్య - కాశీ దివ్య దర్శన యాత్ర తొలి విడతను ప్రారంభించామని అనకాపల్లి జిల్లా ఎంపీ సీఎం రమేశ్ (Anakapalli MP Ramesh) వ్యాఖ్యానించారు. అనకాపల్లి పార్లమెంట్ నుంచి సుమారు 1600 మందిని దివ్యదర్శన యాత్రకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో ఒక నియోజకవర్గం నుంచి దివ్య దర్శన యాత్రకు తీసుకెళ్లడం ఇదే మొదటిసారని వెల్లడించారు. తనకు ఈ అవకాశం దక్కడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సొంత నిధులతో దివ్య దర్శన యాత్రకు తీసుకెళ్తున్నామని వివరించారు.
భక్తులకు ఉచిత ప్రయాణంతో పాటు వసతి, దర్శనం కల్పిస్తున్నామని ఎంపీ రమేశ్ తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్ నుంచి భవిష్యత్తులో మరెన్నో దివ్య దర్శన యాత్రలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహాయం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో ఏపీ అభివృద్ధి బాటలో ముందుకెళ్తుందని చెప్పారు. అనకాపల్లి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనేక పరిశ్రమలు అనకాపల్లికి వస్తున్నాయని ఎంపీ రమేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రౌడీయిజం చేస్తే ఎవరినీ వదిలిపెట్టను: సీఎం చంద్రబాబు
సమర్థ పాలనకు బలమైన వ్యవస్థలే పునాది: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News