Share News

మహిళా ఎస్ఐపై దాడి కేసు.. వైసీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్

ABN , Publish Date - Aug 08 , 2026 | 08:40 PM

శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌ను ఏపీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చిలకపాలెం వద్ద రవిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహిళా ఎస్ఐపై దాడి కేసు.. వైసీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్
YSRCP Leader Chintada Ravi Kumar Arrest

శ్రీకాకుళం జిల్లా, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌ను ఏపీ పోలీసులు ఈరోజు (శనివారం) అరెస్ట్ చేశారు. చిలకపాలెం వద్ద రవిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా ఎస్ఐపై దాడి కేసులో అతను ఏ-1గా ఉన్నారు. పది రోజులుగా పోలీసులు కళ్లుగప్పి రవి తిరుగుతున్నాడు. గత నెల 30వ తేదీన మాజీమంత్రి అప్పలరాజు ములాఖత్ కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా భారీగా కార్యకర్తలతో జగన్‌కు స్వాగతం పాలకటానికి చింతాడ రవి వచ్చాడు.


కొట్టారోడ్డు వద్ద బందోబస్తులో ఉన్న మహిళా ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించటంతో పాటు అసభ్యంగా రవి, అతని అనుచరులు వ్యవహరించారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలోనే చింతాడ రవితో పాటు 28 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. రవి కోసం విస్తృతంగా టా‌స్క్‌ఫోర్స్ పోలీసులు గాలించారు. ఇవాళ సాయంత్రం 7 గంటల సమయంలో ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద చింతాడ రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


వార్తలు కూడా చదవండి...

జగన్ అండ్ కోను కంట్రోల్ చేయడానికి నాకు రెండు నిమిషాలు చాలు: సీఎం చంద్రబాబు

పవన్ కల్యాణ్ మానవత్వం.. కళాకారుల ఆరోగ్యానికి ప్రత్యేక చర్యలు

శ్రీకాళహస్తి వ్యాసాశ్రమం వివాదం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 08:51 PM