మహిళా ఎస్ఐపై దాడి కేసు.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌కు ఆగస్టు 21 వరకు రిమాండ్
ABN , Publish Date - Aug 09 , 2026 | 08:32 PM
మహిళా ఎస్ఐపై దాడి కేసులో వైసీపీ నేత చింతాడ రవికుమార్‌కు ఆగస్టు 21వ తేదీ వరకు శ్రీకాకుళం కోర్టు రిమాండ్ విధించింది. 13 రోజుల పాటు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. అనంతరం రవికుమార్‌ను జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.
శ్రీకాకుళం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మహిళా ఎస్ఐపై దాడి కేసులో వైసీపీ నేత చింతాడ రవికుమార్‌కు ఆగస్టు 21వ తేదీ వరకు శ్రీకాకుళం కోర్టు రిమాండ్ విధించింది. 13 రోజుల పాటు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. అనంతరం రవికుమార్‌ను జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. అతడిని రోడ్డుపై నడిపించుకుంటూ శ్రీకాకుళం కోర్టుకు పోలీసులు తీసుకుచ్చారు. పాతపట్నంలో వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరిచారు. మహిళా ఎస్ఐపై దాడి చేసిన కేసులో నిన్న(శనివారం) చింతాడ రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
వార్తలు కూడా చదవండి...
ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
వివేకా కేసు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వైఎస్ సునీతా సంచలన లేఖ
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల
Read Latest AP News And Telangana News And National News
And Telugu News