Share News

ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డికి మంత్రి నారా లోకేశ్ అభినందనలు

ABN , Publish Date - Jan 25 , 2026 | 06:14 PM

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశ్వరరెడ్డి అద్భుతమైన కృషిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు.

ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డికి మంత్రి నారా లోకేశ్ అభినందనలు
Minister Nara Lokesh

ప్రకాశం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న వాకా వెంకటేశ్వరరెడ్డి (Venkateshwara Reddy) అద్భుతమైన కృషిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ప్రశంసించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.


ప్రధానోపాధ్యాయుడిపై లోకేశ్ ప్రశంసలు..

ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి చేస్తున్న నిస్వార్థ సేవలను గుర్తించిన మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. ‘సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాలను కార్పొరేటుకు దీటుగా తీర్చిదిద్దిన వెంకటేశ్వరరెడ్డి చొరవ ప్రశంసనీయం. విద్యార్థులపై ఆయనకు ఉన్న మమకారం, విద్య పట్ల వారికున్న అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకం.

దూర‌ప్రాంతాల నుంచి విద్యార్థులు స‌కాలంలో బ‌డికి వ‌చ్చేందుకు సొంత ఖ‌ర్చుల‌తో ఆటోలు, విద్యార్థులకు బ‌స్ పాసులు ఇప్పించారు. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మాణం, మ‌ర‌మ్మతులు పూర్తి చేసి, రంగులు వేయించి జడ్పీ పాఠ‌శాల‌ను స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దిన ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి చొరవ ప్రశంసనీయం’ అంటూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ పెట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ భూ దోపిడీకి పాల్పడ్డారు: మంత్రి డీబీవీ స్వామి

బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 25 , 2026 | 07:03 PM