ప్రకాశం జిల్లా బాలిక ఘటనపై మహిళా కమిషన్ దిగ్భ్రాంతి
ABN , Publish Date - Oct 26 , 2026 | 03:29 PM
ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్యకు గురైన విషయం తెలిసిందే. బాలిక ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్యకు గురైన విషయం తెలిసిందే. బాలిక ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలిక కుటుంబాన్ని ఈరోజు (సోమవారం) శైలజ పరామర్శించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. చిన్నారి మృతికి కారణమైన ఘటనపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని అన్నారు. నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాయపాటి శైలజ మాటిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం
జడ్పీ పీఠాలపై కూటమి కసరత్తు.. చంద్రబాబుతో భేటీ తర్వాతే క్లారిటీ!
రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్.. రూ. 2, 500 కోట్లతో BEL ప్రాజెక్టు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News