Share News

నెల్లూరులో రూ.17కోట్లతో చేపట్టిన168 అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

ABN , Publish Date - Aug 10 , 2026 | 10:20 AM

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి రూ.17కోట్లతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు.

నెల్లూరులో రూ.17కోట్లతో చేపట్టిన168 అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
MLA Kotamreddy Sridhar Reddy

నెల్లూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి రూ.17కోట్లతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) ఈరోజు (సోమవారం) ప్రారంభించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద యువతీ, యువకులను సన్మానించి, వారితో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడారు.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నెల్లూరు రూరల్‌లో కూడా ఎక్కడికక్కడ యువతతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

ఎల్‌నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారం: సీఎం చంద్రబాబు

అరాచకాలు, అక్రమాలు చేసే వైసీపీ కనుమరుగైపోయింది: మంత్రి డీబీవీ స్వామి

శ్రీశైల మల్లన్న భక్తులకు అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 10 , 2026 | 10:32 AM