Share News

రక్తచరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసు.. జగన్ అండ్ కోపై మంత్రి నారాయణ ధ్వజం

ABN , Publish Date - May 24 , 2026 | 11:35 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రక్తచరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసు.. జగన్ అండ్ కోపై మంత్రి నారాయణ ధ్వజం
AP Minister Narayana

నెల్లూరు, మే 24 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి నారాయణ (AP Minister Narayana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్తచరిత్ర ఎవరిదో ఏపీ ప్రజలందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. జగన్ అండ్ కో అసత్యాలు మాట్లాడేస్తే జనం నమ్మరని అన్నారు. రక్తచరిత్ర తెలుసు కాబట్టే గత ఎన్నికల్లో వైసీపీని 11సీట్లకు ప్రజలు పరిమితం చేశారని.. ఈ సారి జీరో తప్పదని హెచ్చరించారు. తమ ప్రభుత్వంపై కావాలని జగన్ అండ్ కో అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. చివరకు స్వచ్ఛభారత్ నిధులను కూడా వినియోగించలేదని ఆగ్రహించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పారదర్శకంగా డీఎస్సీ పరీక్షలు నిర్వహించి, నిజాయతీగా పోస్టులు కేటాయించారని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంపై జగన్ అండ్ కో విమర్శలు చేయడం దారుణమని దుయ్యబట్టారు. హైబ్రిడ్ ద్వారా మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో మహానాడు మాదిరిగానే తీర్మానాలు, ఆమోదాలు ఉంటాయని చెప్పారు. కచ్చితంగా కార్యకర్తలకు మాట్లాడే అవకాశం ఉంటుందని అన్నారు.


ఈరోజు(ఆదివారం) నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని పరమేశ్వరనగర్‌ వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న కార్పొరేట్ స్కూల్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. వక్ఫ్‌బోర్డు స్థలంలో కార్పొరేట్ స్కూళ్లను నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. పేద ముస్లిం పిల్లలకు ఎంతో మేలు జరుగుతోందని.. స్విమ్మింగ్ పూల్‌తో సహా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వ్యాఖ్యానించారు. నగరంలో పలు మున్సిపల్ స్కూళ్లను దాతల సహకారంతో కార్పొరేట్ స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఏపీలోని 123 మున్సిపాల్టీల్లో రూ.14వందల కోట్లతో డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

నా దగ్గర తోకజాడిస్తే కట్ చేస్తా.. సీఎం చంద్రబాబు వార్నింగ్

నాలుగు దశల్లో స్వచ్ఛాంధ్ర ఆపరేషన్ క్లీన్ స్వీప్:మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 24 , 2026 | 12:27 PM