Share News

సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి: మంత్రి నారాయణ

ABN , Publish Date - Aug 02 , 2026 | 01:43 PM

సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి: మంత్రి నారాయణ
AP Minister Narayana

నెల్లూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ (AP Minister Narayana) వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈరోజు (ఆదివారం) నెల్లూరు జిల్లాలోని జగదీశ్‌నగర్‌లో మహా రుద్రాభిషేకం, చండీ హోమం, లలితా సహస్రనామ పారాయణం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మహా రుద్రాభిషేకం, చండీ హోమం, లలితా సహస్రనామ పారాయణంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.


మహాయాగాన్ని వరుసగా 18వ సంవత్సరం నిర్వహించడం అభినందనీయమని మంత్రి తెలిపారు. 1108 మంది మహిళలు ఏకకాలంలో లలితా సహస్రనామ పారాయణం చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టమని వెల్లడించారు. సంతానం, వ్యాపారాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ యాగం సమాజంలో సానుకూల శక్తిని పెంపొందిస్తుందని వివరించారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ప్రపంచానికి ఆదర్శమని ఉద్ఘాటించారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో ఆధ్యాత్మిక విలువలు, నైతికతను పెంపొందిస్తాయని చెప్పుకొచ్చారు. భక్తి ఉన్న చోట శాంతి ఉంటుందని తెలిపారు. ధర్మం ఉన్న చోట అభివృద్ధి ఉంటుందని వెల్లడించారు. ఈ రెండు కలిసినప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. రైతులు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పరమేశ్వరుడిని, అమ్మవారిని ప్రార్థిస్తున్నానని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు: సీఎం చంద్రబాబు

నమో సహకారంతోనే ఏపీలో అనేక అభివృద్ధి పనులు: మంత్రి లోకేశ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 02 , 2026 | 03:14 PM