Share News

ఆ బోట్లపై నిఘా పెంచాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ABN , Publish Date - May 19 , 2026 | 04:00 PM

ఏపీ సముద్ర తీర ప్రాంత భద్రతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో నిరంతర గస్తీ కోసం పలు శాఖల అధికారులు, స్థానిక‌ మత్స్యకారులతో సీ పెట్రోలింగ్ జాయింట్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు.

ఆ బోట్లపై నిఘా పెంచాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP CM Chandra babu Naidu

నెల్లూరు, మే 19 (ఆంధ్రజ్యోతి): ఏపీ సముద్ర తీర ప్రాంత భద్రతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) ఆదేశించారు. సముద్రంలో నిరంతర గస్తీ కోసం పలు శాఖల అధికారులు, స్థానిక‌ మత్స్యకారులతో సీ పెట్రోలింగ్ జాయింట్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. నెల్లూరు సముద్ర తీరంలో నిరంతర గస్తీ‌ కోసం ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ పెట్రోలింగ్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు.


ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. డ్రోన్ల ద్వారా గస్తీ నిర్వహిస్తూ, హెచ్చరికలు జారీ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికారులు ప్రదర్శించారు. తమిళనాడు, పాండిచ్చేరి మరబోట్ల కదలికలపై శాటిలైట్ చిత్రాల సాయం తీసుకోవాలని ఆదేశించారు. జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలను విస్తృతంగా వినియోగంలోకి తేవాలని సూచించారు. ఏపీ వ్యాప్తంగా ఫిష్ సీడ్ ఉత్పత్తిని పెంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

భవిష్యత్తు న్యూక్లియర్ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది: నారా లోకేశ్

భార్యను అడ్డుపెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు.. మంత్రి పార్థసారథి షాకింగ్ కామెంట్స్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 19 , 2026 | 04:11 PM