శరవేగంగా తుంగభద్ర పనులు..
ABN , Publish Date - May 23 , 2026 | 12:45 PM
ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణా మూడు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం(టీబీడీ)కు క్రస్ట్ గేట్ల అమరిక పనులు చకచకా సాగుతున్నాయి.
గేట్ల ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం
కేంద్ర జలవనరుల శాఖతోపాటు మూడు రాష్ట్రాలకు ఆహ్వానం
బళ్లారి(బెంగళూరు): ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణా మూడు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం(టీబీడీ)కు క్రస్ట్ గేట్ల అమరిక పనులు చకచకా సాగుతున్నాయి. గేట్లను అధికారికంగా ప్రారంభించేందుకు బోర్డు ఇంజనీర్లు సీడబ్ల్యూసీ అధికారులతో పాటు మూడు రాష్ట్రప్రభుత్వాలను ఆహ్వానం పలకనున్నారు. 33 కొత్త క్రస్ట్‌గేట్ల పనులు దాదాపు పూర్తి అయ్యాయి. అందరి సమక్షంలో త్వరలో ప్రారంభిస్తామని బోర్డు అధికారులు, సెక్రటరీ ఓ.ఆర్.కే రెడ్డి, ఎస్సీ నారాయణ నాయక్, బోర్డు చైర్మన్ పాండ్య తెలిపారు. తెలంగాణా, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల అధికారులకు ఆహ్వనించామని, కేంద్ర జలవనరులు శాఖకు కూడా సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు. ఈనెల చివరిలో అధికారికంగా గేట్లు అపరేషన్ చేయాలా.? జూన్ తొలివారం లోనా అనేది స్పష్టత రావడం లేదని ఇంజనీర్లు తెలిపారు.
తుంగభద్ర డ్యాంను 1953లో నిర్మించారు. సాగు, తాగు నీరు అవసరాల కోసం ఈ డ్యాం నీరు వినియోగించేలా ప్రణాళిక చేశారు. 49.5 మీటర్ల ఎత్తు, 162.7 అడుగులు లోతులో డ్యాంను సుమారు 2.441 వేల ఎకరాల్లో నిర్మించారు. డ్యాం నీటి నిల్వ సామర్థం 133 నుంచి 135 టీఎంసీల నిల్వ సామర్థం ఉండేలా నిర్మానం చేశారు. డ్యాంలో నీరు నిల్వ చేరాక నదికి వదిలేందుకు 33 క్రస్ట్ గేట్లు అమర్చారు. సాగు,తాగు నీరుతో పాటు జలవిద్యుత్తు చేసేందుకు అక్కడ హైడ్రోపవర్ జనరేట్ సిష్టం కూడా ఏర్పాటు చేశారు.
1953లో ఏర్పాటు చేసిన గేట్లు వాటి సామర్థం తగ్గిపోయాయి. 2024 ఏడాది ఆగస్టు 10న డ్యాంకు ఉండే 19వ గేటు నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. డ్యాంలో నీరు వృథాగా నదికి వెల్లకుండా, అలాగే డ్యాం మరిత ప్రమాదంలోకి చేరుకోకుండా 19వ క్రష్ట్ గేటు స్థానంలో తాత్కాలికంగా స్టాప్‌లాక్ ఏర్పాటుచేసి ఆ ఏడాది రైతులకు, అలాగే ప్రజలకు తాగునీరు అందించారు.
అనంతరం సీడబ్ల్యూసీ బృందం, ఏపీ, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కమిటీ నియమించారు. క్రష్ట గేట్ల పరిస్థితి అధ్యయం చేసేందుకు కన్నయ్య నాయుడు లాంటి సీనియర్ ఇంజనీర్లతో అధ్యయనం చేయించారు. నిపుణుల సలహా మేరకు 33 కొత్త గేట్లను సుమారు రూ. 60 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకు తక్షణమే గేట్ల తయారీ సంస్థలకు ఈ- టెండర్ ద్వారా పనులు అప్పగించారు. గేట్ల తయారీ, వాటి నాణ్యత పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు డ్యాంకు కొత్తగా 33 గేట్లు తయారీ పనులు పూర్తీ అయ్యాయి. డ్యాం నిర్మాణం సమయంలో గేట్లుకు చైన్ ఆపరేషన్ అప్పట్లో ఉండేది కాదు. కానీ కొత్త విదానంతో కొత్తగా అన్ని గేట్లకూ చైన్ ఆపరేషన్ సిస్టం కల్పించారు. డ్యాంకు బెడ్‌లెవెల్ నుంచి గేట్లు అమర్చే పనులు పూర్తీ అయ్యాయి. చైన్లు అమర్పే పనులు, అలాగే కొత్త గేట్ల నీటిలోతుప్పు పట్టకుండా రంగులు వేసే పనులు చేస్తున్నారు. డ్యాంలో గేట్లు పనులు దాదాపు పూర్తీ కావడం వల్ల అధికారికంగా గేట్లు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తెలుగుదేశానికో సమన్వయకర్త కావాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News