Share News

అన్నీ ఉన్నా ఏవీ లేవట!

ABN , Publish Date - May 23 , 2026 | 12:04 PM

తిరుపతి జిల్లాలో జనగణన ఎన్యుమరేటర్లకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయిలో గృహగణనకు వెళ్లిన సిబ్బందికి కొంతమంది ప్రజలు వాహనాలు, నివాస గృహాల విషయంలో వాస్తవ సమాచారం దాచి పెడుతన్నారు.

అన్నీ ఉన్నా ఏవీ లేవట!
Census Survey Teams

  • జనగణనలో జనం తీరు ఇదీ

తిరుపతి: తిరుపతి జిల్లాలో జనగణన ఎన్యుమరేటర్లకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయిలో గృహగణనకు వెళ్లిన సిబ్బందికి కొంతమంది ప్రజలు వాహనాలు, నివాస గృహాల విషయంలో వాస్తవ సమాచారం దాచి పెడుతన్నారు. రాష్ట్రప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకోనివారు ఉన్నది ఉన్నట్లు చెబుతుండగా వివిధ పథకాలతో లబ్ధి పొందుతున్న వారు వాస్తవాలను దాచి తప్పుడు సమాచారం చెబుతుండడంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.


లోపలకు వెళ్లి ఎన్యుమరేటర్లు ఇళ్ల గణన చేయాల్సి ఉండగా 90శాతం పైగా ఇంటి యజమానులు బయట నిలబెట్టే సమాధానాలు చెబుతున్నారు. ఇటీవల ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతుండడంతో మీరసలు జనగణన సిబ్బందేనా.. ఐడెంటిటీ కార్డుందా... మీరు ఏ కార్యాలయంలో పనిచేస్తారని ప్రశ్నిస్తుండడంతో సిబ్బంది ఖంగు తింటున్నారు. హౌస్‌ లిస్టింగ్‌లో ప్రజల నుంచి 33 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలంటే కష్టసాధ్యమైపోతోంది.నిజాలు చెబి తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆందోళనతో ఎక్కువమంది వాస్తవాలు దాచిపెడుతున్నారు.


sensex1,2.jpgదీనికితోడు గృహస్తులిచ్చిన సమాచారమే తీసుకోండి....ఇబ్బంది పెట్టవద్దు అని ఉన్నతాధికారులనుంచి మౌఖిక ఆదేశాలు ఉండటంతో వారు చెప్పిందే నమోదు చేసుకుంటున్నారు. దాదాపు 15నుంచి 20శాతం గృహస్తులు అందుబాటులో ఉండడం లేదు. తలుపులు తాళాలు వేసి ఉంటున్నాయి. పక్కవారి నుంచి నెంబరు తీసుకుని ఫోన్‌ చేసినా అందుబాటులోకి రావడంలేదు. వేసవి కావడంతో చాలా మంది విహారయాత్రలకు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక ఉద్యోగులు, రోజువారీ కూలీలు ఉదయమే ఇల్లు వదిలి సాయంత్రానికి తిరిగి వస్తున్నారు.


30 లోపు ఇంటి వివరాలను నమోదు చేసుకోండి

ఈ నెల 30తో ముగియనున్న గృహ గణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఇండ్ల వద్దకు వస్తున్న ఎన్యుమరేటర్లకు సహకరించి తమ ఇంటి వివరాలు తెలియజేయాలి. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేరాలంటే ఖచ్చితమైన సమాచారం అందించాలి.

  • కలెక్టర్‌ వెంకటేశ్వర్‌


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్ రేట్స్.. రెండో రోజూ పతనం

తెలుగుదేశానికో సమన్వయకర్త కావాలి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 23 , 2026 | 12:04 PM