Share News

గోల్డ్ రేట్స్.. రెండో రోజూ పతనం

ABN , Publish Date - May 23 , 2026 | 10:31 AM

భారత్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ పతనమయ్యాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లోని రేట్స్ ఇవీ

గోల్డ్ రేట్స్.. రెండో రోజూ పతనం
Gold, Silver Rates on May 23 In India

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో నేడు కూడా బంగారం ధరలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ధరలు తగ్గడం వరుసగా ఇది రెండోసారి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (మే 23) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ.430ల మేర తగ్గి రూ.1,59,060కు దిగొచ్చింది. 22 క్యారెట్ల పసిడి కూడా నిన్నటితో పోలిస్తే రూ.400ల మేర తగ్గి రూ.1,45,800కు చేరుకుంది. నగరంలో వెండి ధర మత్రం రూ.2.95 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.


దేశవ్యాప్తంగా కూడా బంగారం ధరలు స్వల్ప స్థాయిలో తగ్గాయి. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,690కు చేరుకుంది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,47,300గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,59,060గా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,45,800గా ఉంది. రాజధాని న్యూఢిల్లీలో మేలిమి బంగారం ధర రూ.1,59,210 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,45,950 వద్ద కొనసాగుతోంది.


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు చేసే ముందు ఒకసారి వీటి ధరలు పరిశీలించుకోవాలని సూచన.

ఈ వార్తలనూ చదవండి:

ప్రభుత్వానికి ఆర్‌బీఐ రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్‌

ఏపీ, తెలంగాణల్లో కొత్తగా 30 ఒబెన్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లు

Updated Date - May 23 , 2026 | 10:45 AM