Share News

చైనా బొగ్గు గనిలో పేలుడు.. 82 మంది దుర్మరణం

ABN , Publish Date - May 23 , 2026 | 11:43 AM

చైనాలోని ఒక బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో 82 మంది మృతి చెందారు. షాంగ్జీ ప్రావిన్స్‌లో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

చైనా బొగ్గు గనిలో పేలుడు.. 82 మంది దుర్మరణం
China Coal Mine Explosion

ఇంటర్నెట్ డెస్క్: చైనాలోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించడంతో 82 మంది కార్మికుల మరణించారు. మరో తొమ్మిది మంది ఆచూకీ తెలియట్లేదని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. షాంగ్జీ ప్రావిన్స్‌లో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. ఈ గని టాంగ్జో గ్రూపునకు చెందినది. రాత్రి 7.29 గంటల సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించినట్టు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ప్రమాదసమయంలో అక్కడ 247 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.

ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పందించారు. క్షతగాత్రులకు అండగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించాలని కూడా ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేవారు.


ఈ వార్తలనూ చదవండి:

టీవీ షో వ్యాఖ్యాతను ఎత్తి చెత్తబుట్టలో వేసి.. ట్రంప్ మరో వీడియో వైరల్

ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర? ఇరాన్‌‌లో శిక్షణ పొందిన ఉగ్రవాది అరెస్టు..

Updated Date - May 23 , 2026 | 11:47 AM