Share News

మీ అంతుచూస్తా.. కర్నూలులో బరితెగించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ABN , Publish Date - Oct 26 , 2026 | 08:21 PM

కర్నూలులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌‌ఖాన్ హల్‌చల్ చేశాడు. 16వ వార్డు వడ్డే గేరి, కేవీఆర్ గార్డెన్స్ వద్ద ఎన్నికల ప్రచారంలో వైసీపీ - తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎదురుపడ్డాయి.

 మీ అంతుచూస్తా.. కర్నూలులో బరితెగించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
Kurnool Political Tension

కర్నూలు జిల్లా, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌‌ఖాన్ హల్‌చల్ చేశాడు. 16వ వార్డు వడ్డే గేరి, కేవీఆర్ గార్డెన్స్ వద్ద ఎన్నికల ప్రచారంలో వైసీపీ - తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎదురుపడ్డాయి. ఐదేళ్లలో ఏమీ చేయకుండా మళ్లీ ఓట్లు అడగటానికి వచ్చారా..? అంటూ హఫీజ్‌‌ఖాన్‌ను స్థానికులు ప్రశ్నించారు. సహానం కోల్పోయిన అతడు కారుపైకి ఎక్కి హంగామా సృష్టించాడు. కారుపై నిలబడి మీసం తిప్పుతూ తొడకొట్టి టీడీపీ నేతలకు సవాల్ విసిరాడు. రెండేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని... మీ అంతు చూస్తానని టీడీపీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చాడు.


హఫీజ్‌‌ఖాన్‌ను అక్కడి నుంచి పోలీసులు పంపించి వేశారు. అయితే, ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గొడ్డలి పార్టీ నైజం ఏంటో హఫీజ్‌‌ఖాన్ నిరూపించాడని టీడీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. హఫీజ్‌‌ఖాన్ నడి రోడ్డుపై తమ పార్టీ శ్రేణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. పోలీసుల ఎదుటే రెచ్చిపోయి, పోలీసు స్టేషన్‌లో తమపైనే ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని టీడీపీ నాయకులు ఆగ్రహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

జడ్పీ పీఠాలపై కూటమి కసరత్తు.. చంద్రబాబుతో భేటీ తర్వాతే క్లారిటీ!

రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్.. రూ. 2, 500 కోట్లతో BEL ప్రాజెక్టు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 08:39 PM