జగన్ హయాంలో నాపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు.. మంత్రి ధ్వజం
ABN , Publish Date - Sep 27 , 2026 | 09:10 PM
ఎన్ని అడ్డంకులు ఎదురైనా బనగానపల్లెలో షాదీఖానా నిర్మిస్తానని జీఎమ్ సెంటర్‌లో తొడగొట్టి చెప్పానని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నంద్యాల జిల్లా, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): ఎన్ని అడ్డంకులు ఎదురైనా బనగానపల్లెలో షాదీఖానా నిర్మిస్తానని జీఎమ్ సెంటర్‌లో తొడగొట్టి చెప్పానని ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (AP Minister BC Janardhan Reddy) వ్యాఖ్యానించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం దీనిని నిర్మించి నేడు ప్రారంభించామని.. ఈ రోజును తాను మర్చిపోలేనని పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో మంత్రి జనార్దన్ రెడ్డి ఇవాళ (ఆదివారం) పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ హయాంలో షాదీఖానాకు జీవో ఎక్కడ జారీ చేశారో చూపించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం షాదీఖానా కట్టడంతో ఆయనకు జలసీగా ఉందని విమర్శించారు. దీనికి సంబంధించిన జీవో కాపీని కాటసానికి వాట్సాప్‌లో పంపించానని.. కానీ ఆయన చూసుకోలేదని అన్నారు.
రూ.16 కోట్లతో దద్దనాల చెరువును అభివృద్ధి చేశాం..
తన సొంత నిధులతో షాదీఖానాను పూర్తి చేస్తానని చెప్పానని.. అయితే, వైసీపీ హయాంలో వెంటనే తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించారని మంత్రి ధ్వజమెత్తారు. పోలవరం, నాగార్జున సాగర్ కట్టావా అని కాటసాని రామిరెడ్డి తనపై సెటైర్లు వేస్తున్నారని ఆగ్రహించారు. లిఫ్ట్ ఇరిగేషన్‌లో భాగంగా రూ.16 కోట్లతో దద్దనాల చెరువును అభివృద్ధి చేశానని.. ఇది తన చరిత్ర అని ఉద్ఘాటించారు. వాటర్ ప్లాంట్‌లను ధ్వంసం చేసిన చరిత్ర కాటసానిదని మండిపడ్డారు. ప్రభుత్వ ఆఫీసుల్లో తన ఫొటో ఉండటం చూసి ఆయన ఓర్వలేక పోతున్నారని దుయ్యబట్టారు.
బనగానపల్లె అభివృద్ధిపై వైసీపీ శ్వేతపత్రం విడుదల చేయాలి...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కాటసాని ఫొటోలు బనగానపల్లెలో చాలా చోట్ల ఉన్నాయని.. వాటిని తాను ఏనాడు టచ్ చేయలేదని మంత్రి చెప్పుకొచ్చారు. బనగానపల్లె అభివృద్ధి కోసం కాటసాని ఏమి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల ముందు ఇళ్ల స్థలాల పేరుతో దొంగ పట్టాలు ఇచ్చింది ఎవరో చెప్పాలని నిలదీశారు. కాటసాని డబ్బా రేకులతో షాదీఖానా కట్టించారని విమర్శించారు. మదర్సాను పూర్తి చేసి త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. తాను పని చేసే నేతనని.. బనగానపల్లె ప్రజలు ఆశీర్వాదించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
మైనార్టీలకు అండగా ఉంటా: మంత్రి NMD ఫరూక్

బనగానపల్లెలో షాదీఖానా పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందని మంత్రి NMD ఫరూక్ పేర్కొన్నారు. ఒకప్పుడు ఏపీలో ముస్లింలు పెళ్లిళ్లు చేసుకోలేని పరిస్థితి ఉండేదని చెప్పుకొచ్చారు. దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు హయాంలో ముస్లింలకు కర్నూలులో షాదీఖానా ప్రారంభించారని గుర్తుచేశారు. ఆ తర్వాత ఏపీవ్యాప్తంగా ఇవి కట్టించామని వెల్లడించారు. తాను మైనార్టీలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు.
జగన్ హయాంలో తాము నిధులు ఇచ్చినా.. షాదీఖానాల నిర్మాణాలను ఎందుకు చేపట్టలేదని మంత్రి ప్రశ్నించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డితో పాటు ముస్లింలు వైసీపీ నేతలకు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో పీర్ల పండుగను తమ ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తున్నామని వివరించారు. తల్లికి వందనంలో ముస్లింలకు ఎక్కువ లబ్ధి చేకూరుతోందని చెప్పారు. అందరు పిల్లలు చదువుకోవాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి NMD ఫరూక్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అదానీ గ్రూప్ ఎనర్జీ మానిటరింగ్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేశ్
స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యం: మంత్రి పార్థసారథి
కర్నూలు ఎయిర్‌పోర్టు వేదికగా ఏవియేషన్ శిక్షణ: మంత్రి జనార్దన్ రెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News