గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. జగన్ అండ్ కోకి పయ్యావుల స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Jun 08 , 2026 | 03:39 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రత్యర్థి ప్రజాస్వామ్యవాది కాదని.. అధికారం కోసం ఎన్ని అడ్డదార్లయినా తొక్కేందుకు సిద్ధపడతారని ఎద్దేవా చేశారు.
నంద్యాల, జూన్8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (AP Minister Payyavula Keshav) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రత్యర్థి ప్రజాస్వామ్యవాది కాదని.. అధికారం కోసం ఎన్ని అడ్డదార్లయినా తొక్కేందుకు సిద్ధపడతారని ఎద్దేవా చేశారు. ఈరోజు(సోమవారం) నంద్యాల జిల్లాలో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఎప్పుడూ లైన్ దాటి అధికారాన్ని ఉపయోగించరని, కానీ జగన్ రెడ్డి రోజూ లైన్ దాటుతారని చెప్పారు. సిగరెట్ తాగడం ఎంత హానికరమో.. సమాజానికి వైసీపీ అంతకంటే హానికరమని హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రతిరోజూ కూటమి నేతలు ప్రజలకు చెప్పాలని పేర్కొన్నారు.
ఏపీలో జగన్ అరాచక పాలన రాకూడదు..
ఏపీలో జగన్ అరాచక పాలన మళ్లీ రాకూడదంటే.. 'గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, కూటమి అగైన్ అండ్ అగైన్' అని చాటి చెప్పాలని మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. ప్రజలు ఇచ్చిన 93శాతం స్ట్రైక్ రేటుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిందని వ్యాఖ్యానించారు. నాడు పోలింగ్ బూత్ స్థాయిలో వెనకడుగు వేయకుండా జెండా పట్టుకుని నిలబడిన ప్రతి కార్యకర్త శ్రమ, ధైర్యమే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. కార్యకర్తల త్యాగాలను మరిచిపోతే ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించలేదని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలవబోయే నాయకులందరి కోసం తాము కష్టపడాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
గ్రూపు రాజకీయాలు కడితే పతనం తప్పదు..
గ్రూపు రాజకీయాలు కడితే పతనం తప్పదని మంత్రి పయ్యావుల హెచ్చరించారు. కార్యకర్తలు, నేతలు అలకలు వీడాలని అన్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అలిగి పార్టీకి దూరమవ్వద్దని చెప్పారు. కొట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. రాయలసీమ రాజకీయాల్లో అప్రమత్తత అవసరమని తెలిపారు. గొడ్డలి పార్టీపై నిరంతర పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మనం ప్రభుత్వంలో ఉన్నామని నిద్రపోవద్దని చెప్పారు. టీడీపీ శ్రేణులు ఓటర్ లిస్ట్‌పై పట్టు సాధించాలని దిశానిర్దేశం చేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు
16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల
Read AP News Latest And Telangana News And National News
And Telugu News