ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సమష్టి సన్నాహాలు
ABN , Publish Date - Sep 05 , 2026 | 09:48 PM
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలకు సమష్టి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) వ్యాఖ్యానించారు.
విజయవాడ, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలకు సమష్టి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Sivanath) వ్యాఖ్యానించారు. దసరా ఏర్పాట్లపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించామని.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి, సీపీ రాజశేఖర్‌బాబు కలెక్టర్, ఈవో, పాలకమండలి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. శాఖల సమన్వయంతో పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
సామాన్య భక్తుల ఉచిత దర్శనానికి పెద్దపీట వేస్తున్నామని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు. రద్దీ నియంత్రణకు మూడు హోల్డింగ్ ప్రాంతాలు కేటాయించామని వెల్లడించారు. భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రణాళికలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కృత్రిమ మేధతో భక్తుల రద్దీని అంచనా వేస్తున్నామని అన్నారు. అమ్మవారి దర్శనానికి పట్టే సమయంపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. భక్తుల భద్రత కోసం భారీగా డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త కమాండ్ కంట్రోల్ కేంద్రంతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని అన్నారు.
డిజిటల్ సూచికలు, ఆటోమేటిక్ ప్రకటనలతో దిశానిర్దేశం చేస్తున్నట్లు ఎంపీ శివనాథ్ తెలిపారు. ప్లాస్టిక్ వినియోగానికి క్రమంగా కళ్లెం వేస్తున్నామని అన్నారు. బబుల్ వాటర్ విధానంపై దృష్టి పెట్టామని చెప్పారు. ఉచిత తాగునీరు, పాలు, అన్నప్రసాదం విస్తరణపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కొత్తగా అన్నప్రసాదం, లడ్డూ కౌంటర్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీఐపీ పాసుల జారీపై నియంత్రణ విధిస్తున్నట్లు వెల్లడించారు. కొండపై ద్విచక్రవాహనాలకు అనుమతి లేదన్నారు. భక్తుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఘాట్ రోడ్డుపై వాహనాల నిలపడంపై కట్టడి చేస్తున్నామని.. భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యమని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ
జాతీయ స్థాయిలో పోలీస్ గేమ్స్‌లో ఏపీకి మంచి పేరు తీసుకురావాలి: డీజీపీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News