Share News

వైసీపీలో 70కు పైగా అవమానాలు.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:27 AM

వైసీపీలో 70కు పైగా అవమానాలను తాను భరించానని రాజకీయ పరివర్తన పార్టీ అధినేత విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైసీపీని స్వచ్ఛందంగా వీడలేదని పేర్కొన్నారు.

వైసీపీలో 70కు పైగా అవమానాలు..  విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Vijayasai Reddy

విజయవాడ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): వైసీపీలో 70కు పైగా అవమానాలను తాను భరించానని రాజకీయ పరివర్తన పార్టీ (PRP) అధినేత విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైసీపీని స్వచ్ఛందంగా వీడలేదని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) విజయవాడలో మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడారు. వైసీపీలో తనను అవమానించి, బలవంతంగా బయటకు పంపించారని చెప్పుకొచ్చారు. ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట ఎవరూ ఉండలేరని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుడు మాటలు విని తనను ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


వైసీపీలో అవమానించారు..

మనిషన్నవాడు తట్టుకోలేని విధంగా వైసీపీలో తనను అవమానించారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కీలక వ్యక్తులు కొత్త పార్టీలోకి వస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే సుమతీరెడ్డి, బోని గణేశ్‌లు నాయకులు తన పార్టీలో చేరారని ప్రస్తావించారు. అన్ని కులాలు, మతాలకు సమాన న్యాయం జరిగేలా కొత్త పార్టీ ఏర్పాటు చేశానని తెలిపారు. రెండు కుటుంబాల పాలనకు భిన్నంగా ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు. యువతకు నూతన పార్టీలో ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. పార్టీలో నియంతృత్వ పోకడలకు తావుండదని తేల్చిచెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ అందరికీ సమానంగా అమలు చేస్తామని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్

ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. 30కు పైగా అజెండా అంశాలపై సీఎం చర్చ

జగన్.. వైఎస్సార్ పేరు చెడగొడుతున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 12:48 PM