శాప్ కార్యాలయంలో గురువులపై దాడి.. ఆరు కేసులు నమోదు
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:03 PM
విజయవాడ ఇందిరా స్టేడియంలోని ‘శాప్’ కార్యాలయం దగ్గర మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై కొంతమంది దాడి చేసిన విషయం తెలిసిందే.
అమరావతి, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇందిరా స్టేడియంలోని ‘శాప్’ కార్యాలయం దగ్గర మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై కొంతమంది దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన వారిపై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. సూర్యారావుపేటలో రెండు, మాచవరం పోలీస్ స్టేషన్‌లో రెండు, కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు హత్యాయత్నం, దాడులు, దౌర్జన్యాలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణలో ఆటంకం కలిగించడం, విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేయడం వంటి నేరాల కింద కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసుల్లో వైసీపీ యువజన విభాగం నేత రవిచంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు, విజయవాడ, పల్నాడు జిల్లాల్లోని రౌడీ షీటర్లపై విజయవాడ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. శాప్ ఘటనలో కొంతమంది పోలీస్ అధికారుల అలసత్వంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే నివేదిక ఇవ్వాలని పోలీసులను ఏపీ సర్కార్ ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జూనియర్ డాక్టర్లకు ఏపీ సర్కార్ శుభవార్త.. స్టైపెండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ
ఏపీలో అతిభారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హోం మంత్రి అనిత
పోలీసులు కొట్టడం వల్లే సాయికృష్ణ చనిపోయాడు: సిట్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News