Share News

డ్రగ్స్‌పై పోలీసుల కొరడా.. మత్తు పదార్థాలపై స్పెషల్ డ్రైవ్

ABN , Publish Date - Apr 12 , 2026 | 09:44 PM

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మత్తు పదార్థాల నిర్మూలన ధ్యేయంగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. 'డ్రగ్స్ పై దండయాత్ర-2' కార్యక్రమంలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

డ్రగ్స్‌పై పోలీసుల కొరడా.. మత్తు పదార్థాలపై స్పెషల్ డ్రైవ్
NTR District Drug Test

ఎన్టీఆర్ జిల్లా, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): జగ్గయ్యపేట నియోజకవర్గంలో మత్తు పదార్థాల నిర్మూలన ధ్యేయంగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. 'డ్రగ్స్ పై దండయాత్ర-2' కార్యక్రమంలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

మత్తును వదిలిద్దాం..

జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలోని జగ్గయ్యపేట, చిల్లకల్లు, వత్సవాయి, పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తనిఖీలు చేపట్టారు. అనుమానితులుగా గుర్తించిన 112 మందికి యూరిన్ టెస్టులు నిర్వహించగా, అందులో 30 మందికి పాజిటివ్ అని తేలింది. అంటే వీరు డ్రగ్స్ లేదా గంజాయి వంటి మత్తు పదార్థాలను వాడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది.


ప్రముఖుల హాజరు..

'డ్రగ్స్ పై దండయాత్ర-2' కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ, జగ్గయ్యపేట సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు.

పోలీసుల తదుపరి చర్యలు..

మత్తు పదార్థాలకు బానిసలైన వారిని కేవలం నేరస్థులుగా చూడకుండా, వారిని ఆ రొంపి నుంచి బయటకు తీసుకువచ్చేందుకు పోలీసులు మానవీయ కోణంలో చర్యలు తీసుకుంటున్నారు.


రీహాబిలిటేషన్..

డ్రగ్స్ పాజిటివ్ అని తేలిన 30 మందిని కౌన్సెలింగ్ నిమిత్తం విజయవాడలోని రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించనున్నారు. యువత డ్రగ్స్, గంజాయి, మద్యపానానికి దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వల్ల జీవితాలు ఎలా చిన్నాభిన్నం అవుతాయో ఈ సందర్భంగా పోలీసులు వివరించారు. నియోజకవర్గంలో గంజాయి, డ్రగ్స్ విక్రయించే ముఠాలపై కఠినంగా వ్యవహరిస్తామని, అక్రమ రవాణాను అరికట్టేందుకు నిరంతర నిఘా ఉంటుందని పోలీసులు హెచ్చరించారు


ఈ వార్తలు కూడా చదవండి...

ఘనంగా బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు..

చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగింది: అనిత

జువ్వలదిన్నె హార్బర్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: సోమిరెడ్డి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 12 , 2026 | 09:48 PM