Share News

భారతీయ సంస్కృతి పరిరక్షణే లక్ష్యం: సుజనా చౌదరి

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:02 AM

భారతీయ సంస్కృతి పరిరక్షణే లక్ష్యమని ఎమ్మెల్యే సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని కొనియాడారు.

భారతీయ సంస్కృతి పరిరక్షణే లక్ష్యం: సుజనా చౌదరి
MLA Sujana Chowdary

విజయవాడ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): భారతీయ సంస్కృతి పరిరక్షణే లక్ష్యమని ఎమ్మెల్యే సుజనా చౌదరి (MLA Sujana Chowdary) వ్యాఖ్యానించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని కొనియాడారు. వారు దేశ స్వాతంత్య్రాన్ని ఎంతో కష్టపడి తీసుకువచ్చారని పేర్కొన్నారు. 'హర్ ఘర్ తిరంగా' యాత్ర దేశంలో గత పదేళ్ల నుంచి జరుగుతుందని ప్రస్తావించారు. ఈరోజు (గురువారం) విజయవాడలోని భవానీపురంలో 60 అడుగుల త్రివర్ణ పతాకంతో తిరంగా రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడారు.


భారతదేశం మీద ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఒక అభ్యుదయ భావం, భక్తి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. మన దేశ సంప్రదాయాలు, సంస్కారాలను మరిచిపోకుండా ఉండటానికి తిరంగా రన్‌ను ప్రారంభించారని పేర్కొన్నారు. పిల్లలందరితో ఈ భవానీపురం రోడ్డులో తిరంగా యాత్ర గొప్పగా జరిగిందని చెప్పుకొచ్చారు. పిల్లలందరికీ దేశభక్తి ఎందుకు ముఖ్యమనేది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. స్కూళ్లలో, కాలేజీల్లో కూడా తిరంగా యాత్ర గురించి వివరించాలని తెలిపారు. మన భారతీయ సంస్కృతి సంస్కారాన్ని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ 'హర్ ఘర్ తిరంగా' యాత్ర చేపట్టామని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం

నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 11:32 AM