విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:19 AM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను మంగళవారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసిన బోయపాటి శ్రీను అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయవాడ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను (Director Boyapati Srinu) ఈరోజు (మంగళవారం) దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసిన బోయపాటి శ్రీను అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గా దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. బోయపాటి శ్రీను కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. బోయపాటి ఇంద్రకీలాద్రికి రావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.


అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ..
కాగా, దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట చేతబట్టి.. మానవాళికి ఆకలి దప్పికలు తీర్చే అన్నపూర్ణ దేవి అవతారంలో కనువిందు చేస్తున్నారు. సాక్షాత్తు పరమేశ్వరుడికి అన్నం పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి అని పండితులు తెలిపారు. ఈ తల్లిని సేవిస్తే ధనధాన్యాభివృద్ధి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పండితులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణమే మా లక్ష్యం:మంత్రి ఆనం
ఇంద్రకీలాద్రిపై గాయత్రీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News