Share News

చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్.. స్థానిక ఎన్నికలపై కీలక చర్చ

ABN , Publish Date - Oct 06 , 2026 | 10:15 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌కు చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్వాగతం పలికారు.

చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్.. స్థానిక ఎన్నికలపై కీలక చర్చ
CM Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan

అమరావతి, అక్టోబర్ 6: ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌కు చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ముగ్గురూ కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తూ స్థానిక ఎన్నికలపై చర్చిస్తున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమి పక్షాల మధ్య సమన్వయం, కలిసి పోటీ చేయడం, రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతో పాటు నియోజకవర్గ స్థాయి కమిటీల నియామకంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పర్సంటేజ్‌లతో సంబంధం లేకుండా పొత్తులతో ఎవరికి బలమున్న ప్రాంతాలలో వారు పోటీ చేయాలని నేతలు భావిస్తున్నట్లు సమాచారం.


గెలుపే ధ్యేయంగా మూడు పక్షాలు పని చేయాలనీ ఇప్పటికే నేతలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఏ ఒక్క స్థానం కూడా వైసీపీకి దక్కకుండా చేయాలని నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో తొలిదశలో జరిగే నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలపై ఇరువురు నేతల మధ్య ప్రధానంగా చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. అలాగే, రాబోయే శుక్రవారం సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు వస్తున్న నేపథ్యంలో దానిపై కూడా ఇరువురు చర్చించనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన వెంటనే ఏ క్షణ లోనైనా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అంశంపైనా నేతల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ బాధ్యత అదే: టీమిండియా బౌలింగ్ కోచ్

స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉంది: మంత్రి మండిపల్లి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 11:25 AM