Share News

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి వెనుక ఇరాన్ ఉందనిపిస్తోంది: ట్రంప్

ABN , Publish Date - Oct 06 , 2026 | 07:34 AM

ఫ్లైదుబాయ్ విమానం ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ చేసిన ఉగ్రదాడి వెనుక ఇరాన్ హస్తం ఉండవచ్చని ట్రంప్ ఆరోపించారు.

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి వెనుక ఇరాన్ ఉందనిపిస్తోంది: ట్రంప్

ఇంటర్‌నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ విమానం ఉదంతంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లైదుబాయ్ విమానంలో గత నెల 30న ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ చేసిన ఉగ్రదాడి వెనుక ఇరాన్ హస్తం ఉండవచ్చని ట్రంప్ ఆరోపించారు. తనకు అలాగే అనిపిస్తోందన్నారు. ఆ ఉగ్రదాడి వెనుక ఇరాన్ హస్తం ఉండవచ్చా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఆవిధంగా బదులిచ్చారు. ఆ దాడి వెనుక ఇరాన్ ఉండవచ్చని తాను భావిస్తున్నానని, అది తన వ్యక్తిగత కామెంట్ అని ట్రంప్ చెప్పారు. అయితే, తన ఆరోపణలకు బలం చేకూర్చే ఎలాంటి సమాచారాన్ని ఆయన వెల్లడించలేదు. ఈనెల 1న కూడా ట్రంప్ అలాంటి కామెంటే చేశారు. ఫ్లైదుబాయ్ అటాక్ వెనుక ఇరాన్ ఉన్నట్లు తేలితే, వారిపై తీవ్రమైన దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు.


ఇరాన్ హస్తం లేదన్న వాన్స్

డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భిన్నంగా స్పందించారు. ఫ్లైదుబాయ్ ఘటన వెనుక ఇరాన్ హస్తం ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ ఇంకా ధ్రవీకరించలేదని ఆయన చెప్పారు. ‘‘ఫ్లైదుబాయ్ ఘటనపై ఇప్పుడే నేను ఎలాంటి ప్రకటనలు చేయను. మచ్చార్‌పై జరిగిన దాడిపై దర్యా్ప్తు జరుగుతోంది. ఇప్పుడే ఆ దర్యాప్తుపై ఒక నిర్ణయానికి రాలేను’’ అని వాన్స్ పేర్కొన్నారు. మచ్చార్‌పై దాడిచేసిన కోపైలట్ హమ్మామీ ఒమన్‌కు చెందిన వాడని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా.. హమ్మామీ వెనుక ఎలాంటి సంస్థ లేదని అమెరికా అధికారులు పేర్కొన్నట్లు ఎన్‌బీసీ న్యూస్ తెలిపింది. అలాగే, విమానాన్ని టెల్ అవీవ్ సమీపంలోని బెన్-గురియెన్ విమానాశ్రయంలో కూల్చివేసేందుకు హమ్మామీ యత్నించాడని అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సౌదీ రక్షణకు తుర్కియే, పాకిస్థాన్ బలగాలు..

వాళ్ల దగ్గర భారీగా అణ్వాయుధాలున్నాయి..

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 06 , 2026 | 07:43 AM