Share News

సౌదీ రక్షణకు తుర్కియే, పాకిస్థాన్ బలగాలు.. మక్కా డిఫెన్స్ అలైన్స్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Oct 06 , 2026 | 07:34 AM

సౌదీపై దాడుల నేపథ్యంలో మక్కా డిఫెన్స్ అలైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి రక్షణ కట్టుబాట్లను తక్షణమే అమలు చేసి.. సైనిక బలగాలు సౌదీలో వేగంగా మోహరించేందుకు తుర్కియే, పాకిస్థాన్ సిద్ధమయ్యాయి.

సౌదీ రక్షణకు తుర్కియే, పాకిస్థాన్ బలగాలు.. మక్కా డిఫెన్స్ అలైన్స్ కీలక నిర్ణయం
Makkah Defense Alliance

రియాద్ (సౌదీ అరేబియా)అక్టోబర్ 6: యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ సౌదీ అరేబియాపై నిరంతరం జరుపుతున్న క్షిపణి, డ్రోన్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. సౌదీ అరేబియా రక్షణార్థం ఏర్పాటు చేసిన ‘మక్కా డిఫెన్స్ అలైన్స్’ లోని ఉమ్మడి రక్షణ నిబంధనలనుతక్షణమే అమలు చేయాలని సౌదీ అరేబియా, తుర్కియే (టర్కీ) పాకిస్థాన్ దేశాలు నిర్ణయించాయి. (Makkah Defense Alliance)


రియాద్‌లో జరిగిన అత్యవసర సమావేశంలో ఈ మూడు దేశాలు తమ సైనిక బలగాలను, ఆయుధ సంపత్తిని వేగంగా సౌదీ అరేబియాలో మోహరించేందుకు అంగీకరించాయి. సౌదీ భూభాగం, పవిత్ర పుణ్యక్షేత్రాలైన మక్కా, మదీనా లను లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన దాడులను మూడు దేశాలు తీవ్రంగా ఖండించాయి. మక్కా ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే అది కూటమిలోని మూడు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తూ 'కలెక్టివ్ డిటెరెన్స్' చర్యలు ప్రారంభించారు.


గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఆయా దేశాల జాతీయ చట్టాలకు అనుగుణంగా తమ సైనిక సామర్థ్యాలను, బలగాలను సౌదీ అరేబియాకు వేగంగా తరలించడానికి కమిటీ తుది ఆమోదం తెలిపింది. కూటమికి సంస్థాగత రూపాన్ని ఇస్తూ, పాకిస్థాన్ ఆర్మీకి చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ నుమాన్ మహమూద్‌‌ను మక్కా డిఫెన్స్ అలైన్స్ మొదటి సెక్రటరీ జనరల్‌గా 3 సంవత్సరాల కాలపరిమితికి నియమించారు.


మా దేశాల సార్వభౌమాధికారం, పవిత్ర స్థలాల రక్షణలో అందరం ఏకతాటిపై ఉన్నామని, . సౌదీపై జరిగిన దాడులకు బాధ్యులైన వారిపై ఉమ్మడి ప్రతిఘటన చర్యలు తీసుకోవడానికి కమిటీ అంగీకరించిందని సౌదీ అరేబియా రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ చెప్పారు.

హౌతీలకు బలమైన హెచ్చరిక

ఈ మోహరింపుతో హౌతీ తిరుగుబాటుదారులకు, వారి వెనుక ఉన్న శక్తిలకు ముప్పేట దాడి ఎదురవుతుందని కూటమి స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వేళ సౌదీ అరేబియాకు తుర్కియే, పాకిస్థాన్‌ నుంచి లభించిన ఈ ప్రత్యక్ష సైనిక మద్దతు ప్రాంతీయ భద్రతలో అత్యంత కీలక పరిణామంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.

ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్

Updated Date - Oct 06 , 2026 | 07:34 AM