వాళ్ల దగ్గర భారీగా అణ్వాయుధాలున్నాయి.
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:58 AM
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌లతో వ్యక్తిగతంగా విభేదాల్లేకుండా, అంత సఖ్యతగా ఉండటానికి కారణం ఏంటని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విచిత్రమైన సమాధానం ఇచ్చారు.
అందుకే ఆ దేశాల నాయకులతో సఖ్యత
జిన్‌పింగ్, కిమ్‌ల గురించి ట్రంప్ వ్యాఖ్య
వాషింగ్టన్, అక్టోబరు 5: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌లతో వ్యక్తిగతంగా విభేదాల్లేకుండా, అంత సఖ్యతగా ఉండటానికి కారణం ఏంటని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విచిత్రమైన సమాధానం ఇచ్చారు. ‘‘అంత భారీ సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్న దేశాల నాయకులతో సఖ్యతగా ఉండాలి కదా. ఉత్తరకొరియా దగ్గర 112 అణ్వాయుధాలు ఉన్నాయి. అలాంటి దేశాల నాయకులతో కలిసిమెలిసి ఉండటం మంచిదే’’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల రిపబ్లికన్లకు సంబంధించిన ఓ కార్యక్రమంలో ట్రంప్.. తనను ఓ వ్యక్తి జిన్‌పింగ్, కిమ్‌లతో సత్సంబంధాలపై ప్రశ్నించారంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఆయన, ఇరాన్‌ను మాత్రం అణ్వాయుధాలను తయారు చేయనివ్వబోం అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.
ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్